28-02-2025 12:00:00 AM
దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ రా ష్ట్ర రాజకీయం విభిన్నమైనదిగా కనిపిస్తుంది. కర్ణాటకలో జాతీయ పార్టీల మధ్య, కేరళలో కూటమి పార్టీల మధ్య, ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీల మధ్య, తమిళనాడులో ద్రవిడ పార్టీల మధ్య అధికారం కోసం పోరు జరుగుతుంటే తెలంగా ణలో మాత్రం ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీల మధ్య అధికారం కోసం పోరు జరుగుతోంది. రాష్ట్ర సాధన కోసమే ఏర్పాటైన, బలమైన నాయకత్వం కలిగిదశాబ్దకాలం పాటు రాష్ట్రాన్ని పాలించిన పార్టీని కూడా ఓడించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాజకీ య పరిణితిని ప్రదర్శించారనే చెప్పాలి.
ఆ త్మగౌరవం మెండుగా ఉన్న తెలంగాణ ప్ర జలు అహంకారపూరిత పాలనను అధికా రం నుండి దించడంతో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజా పాలన హామీతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చింది. గత 14 నెలలుగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పాల న ప్రజలను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోతోందని, పనిచేస్తున్నా ప్రభుత్వానికి రా వలసిన గుర్తింపు రావటం లేదనేది ప్రభుత్వాన్ని వేధిస్తున్న ప్రశ్న.
మరీ విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్‌సైట్ నుండి ప్రజా పాలన కావా లా ఫామ్‌హౌస్ పాలన కావాలా అని ఓ టింగ్ పెడితే 60 శాతం కంటే ఎక్కువగానే ఫామ్‌హౌస్ పాలన కావాలని అభిప్రాయపడ్డారంటే కాంగ్రెస్ ప్రజా పాలనపై పున స్సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్లుగానే కనిపిస్తుంది.
పథకాల అమలులో గందరగోళం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి గత ప్రభుత్వ పాలనపై ప్రజల అసంతృప్తితో పాటు ఎన్నికల సం దర్భంగా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీ లు, ఆరు గ్యారెంటీలు కూడా ఒక కారణం. కానీ ఏ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీని అధికారానికి చేరువ చేశాయో వాటిని అమలు చేయటంలో, హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళాని కి, తడబాటుకు గురవుతున్నట్లుగా కనిపిస్తుంది.
14 నెలల రేవంత్ రెడ్డి పాలనలో పెట్టుబడుల ఆకర్షణలో మాత్రమే ప్రభుత్వానికి మంచి మార్కులు పడుతున్నాయి. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినా వే గంగా తుది నియామకాలు చేపట్టి నియామక పత్రాలు అందజేయటంలో కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ప్రశంస లు అందుకుంటోంది. 21 వేల కోట్ల రూ పాయలతో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని వి ధంగా 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినా ప్రభుత్వానికి రావలసిన పే రు రాలేదు.
ఇలాంటి హామీని అమలు చే సే సమయంలో రాష్ట్రంలో ముందుగా ల బ్ధిదారులను ప్రకటించి దశలవారీగా కాల వ్యవధిలో రుణమాఫీ చేసి ఉంటే బాగుండేది. కానీ హామీ అమలులో గందరగోళం ఎక్కువగా కనిపించడమే కాదు రుణమాఫీ విషయంలో ఏకంగా ముఖ్యమంత్రి మాట తప్పారని రైతాంగం భావించటం, ఇంకాదాదాపు 15 లక్షల మంది రైతులు రుణ మాఫీ కోసం ఎదురు చూడటం, రుణమా ఫీ చేస్తున్నాం కదా అని ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఎగవేసే ప్రయత్నం చేసిందని రైతులు భావించటం,
సన్నాలకే 500 రూపాయల బోనస్ ప్రకటన కూడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మోసం చే స్తుందని భావించటంతో రైతాంగంలో ప్ర భుత్వ ప్రతిష్ఠ దెబ్బతిన్నదనే చెప్పాలి. కులగణన లాంటి ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమం చరిత్రలో నిలిచి పోవాలి కానీ కులగణన సర్వే రిపోర్ట్ బయటపెట్టిన తరువాత బీసీ సామాజిక వర్గాల నుండి వచ్చే వ్యతిరేకత ను సబ్ కమిటీ అంచనా వేయలేకపోవ టం వలన ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మెజార్టీ సామాజిక వర్గం లో కాంగ్రెస్ ప్రభుత్వం దోషిగా నిలబడిం ది. నష్ట నివారణకు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న హామీలు
ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారంగా పథకాలను అమలు చేయడం లేదని చెప్పటానికి ఇటీవల ప్రభుత్వం ఒకేసారి ప్రారం భించిన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇ ళ్ల నిర్మాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆ త్మీయ భరోసా నిధుల విడుదల లాంటి నాలుగు పథకాలే ఉదాహరణ. ఈ నాలు గు పథకాలలో ఏ ఒక్కటీ ప్రభుత్వం స రిగా చిత్తశుద్ధితో అమలు చేయకపోవడం వలన ప్రజల నుండి ప్రభుత్వానికి ప్రతికూలత వ్యక్తం అవుతోంది.
ప్రాధాన్యతా క్ర మంలో ఒక్కొక్క పథకాన్ని ప్రణాళికాబద్ధం గా అమలు చేయటం ద్వారా ఆయా పథకాల లబ్ధిదారులలో ప్రభుత్వ ఇమేజ్ పెరు గుతుంది. కానీ ప్రభుత్వం పథకాల అమలులో ఎక్కడా తన నిబద్ధతను ప్రదర్శించ లేక పోతుంది. ఫ్రీబస్, ఉచిత గృహ వి ద్యుత్తు లబ్ధిదారులు, గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల వలన లబ్ధి పొందుతున్నామనే భావన కలగకపోవ టం వలన వారు ప్రభుత్వ లబ్ధి ప్రచార కర్తలుగా పని చేయటం లేదు.
మరొకవైపు మ హిళలకు ప్రతినెల 2500 రూపాయలు ఇ చ్చే మహాలక్ష్మి పథకం, ప్రతినెలా వృద్ధులకు 4,000 రూపాయలు ఇచ్చే చేయూ త, ప్రతి నెల రూ. 3000 నిరుద్యోగ భృతి ఇచ్చే యువ వికాసం లాంటి పథకాలు అ మలు చేయకపోవటం వలన ప్రభుత్వంపై ప్రజలలో ఒక విధమైన అంతర్లీన అపనమ్మకం,
అసంతృప్తి వ్యక్తమవుతోంది. మ ధ్యప్రదేశ్ లో బీజేపీని గెలిపించిన లాడ్లీ బె హన్, మహారాష్ట్రలో లడ్కీ బెహన్, ఢిల్లీలో మహిళా సమ్మాన్ యోజన, జార్ఖండ్‌లో జేఎంఎంని గెలిపించిన సీఎం మయ్యా యోజన, ఏపీలో టీడీపీని గెలిపించిన ఎన్టీఆర్ భరోసా లాంటి పథకాలను ఆయా ప్ర భుత్వాలు అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నాయి.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహాలక్ష్మి గ్యారంటీని, చేయూత పెన్షన్ హామీని, నిరుద్యోగ భృతిని అమ లు చేయటం లేదు కాబట్టి ప్రభు త్వం ప్రజలలో నమ్మకాన్ని పెంచు కోలేకపోతుందనే చెప్పాలి. మూసీ ప్రక్షాళన, హై డ్రా లాంటి ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మంచివే కానీ మధ్యతరగతి ప్రజలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే ఇలాంటి నిర్ణయాలను అమలు చేసేటప్పుడు ఎదురయ్యే పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొవాలి.
కనిపిస్తున్న సమన్వయ లోపం
పార్టీ రాజకీయం చేయాలి, ప్రభుత్వం పాలన చేయాలి కానీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లటంలో నూ, ప్రతిపక్షాల విమర్శలను తెప్పికొట్టటంలోనూ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వైఫ ల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వంలో ని కీలకమైన వ్యక్తులు ముఖ్యమంత్రితో స హా పాలనపై కంటే కూడా రాజకీయాలపై, రాజకీయ విమర్శలపై దృష్టి పెట్టటం వల న ప్రభుత్వం ప్రజల పక్షాన పని చేయటం లేదనే అభిప్రాయం బలపడుతోంది.
మం త్రులు అనేక సందర్భాలలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టటం, ప్రభుత్వ అధికారు లు ప్రజల కోసం పనిచేయటం లేదని సా క్షాత్తు సీఎం అసంతృప్తి వ్యక్తం చేయటం చూస్తుంటే ప్రజలకు కాంగ్రెస్ ప్ర భుత్వంపై నమ్మకం సడలుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ చేయక 12 మంది మంత్రులతో నెట్టుకొస్తున్న వైనం, పార్టీ ఫిరాయింపులు, ఆర్థిక, రెవెన్యూ శాఖ ల వైఫల్యాలు ప్రభుత్వ ప్రతిష్టను మరింత మసకబారుస్తున్నాయి.
2023- 24 బడ్జె ట్ 2.31 లక్షల కోట్ల రూ పాయలు ఖర్చు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 202425 బడ్జె ట్ అంచనాలను చేరుకోలేకపోవటం వల న హామీలను, గ్యారెంటీల ను అమలు చే యలేక పోతోంది. 2. 21 లక్షల కోట్ల రూ పాయల రెవెన్యూ ఆదాయాన్ని రాబట్ట లేకపోవటమే కాదు 62 వేల కోట్ల రూపాయల రుణలక్ష్యం కంటే ఎక్కువగానే అప్పు లు చేసింది.
ప్రభుత్వం బడ్జెట్ లక్ష్యాలను చేరుకోలేకపోవటం వలన అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలను సంతృప్తిక ర స్థాయి లో ప్రభుత్వం అమలు చేయలేకపోతోంది. కొత్త రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చా ర్జి అయినా పార్టీని, ప్రభుత్వాన్ని గాడిలో పెట్టకపోతే భ విష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. దేశంలో కాంగ్రె స్ బలంగా ఉన్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే. ఇక్కడ కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.
వ్యాసకర్త సెల్: 9885465877
డాక్టర్ తిరుణహరి శేషు