calender_icon.png 13 January, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలపె చర్చ ఏది?

26-12-2024 11:56:42 PM

దేశంలో అత్యున్నత చట్టసభలైన లోక్ సభ, రాజ్యసభలో, రాష్ట్రస్థాయిలలో శాసనసభ, శాసన మండలిలో ప్రజా సమస్యలపైన ప్రభుత్వ విధానాలపై న అర్థవంతమైన చర్చ జరిగినప్పుడే వాటి ప్రతిష్ఠ పెరగటమే కాదు ప్రజలకు, దేశానికి కూడా మంచి జరుగుతుంది.

కానీ గత కొంతకాలంగా చట్టసభలలో ప్రజా స మస్యలపైన, ప్రభుత్వ విధాననిర్ణయాలపై న చర్చ జరగక పోగా, పాలక, ప్రతిపక్ష పా ర్టీ లు రాజకీయంగా పైచేయి సాధించటానికి, వ్యక్తిగత దూషణలకు చట్టసభలను ఉ పయోగించుకోవటం వలన విలువైన ప్ర జా ధనం వృధా కావటమే కాదు, ప్రజా సమస్యలకు సరైన పరిష్కారం కూడా దొరకటం లేదు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎంపీలు బాహాబాహీకి దిగటం, స భ్యులపై దాడి ఆరోపణలు పార్లమెంటు ప్రతిష్ఠ ని మసకబారిస్తే తెలంగాణ శాసనసభలో కూడా కీలక ప్రజా సమస్యలపైన అర్థవంతమైన చర్చ జరిగే వాతావరణం నెలకొ నలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

బలహీనంనుండి బలమైన ప్రతిపక్షం దాకా! 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014,2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సభలో బలమైన ప్రతిపక్షం ఏర్పడ కపోగా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన శాసనసభ్యులు అధికార పార్టీలోకి ఫిరాయించ టం వలన ప్రతిపక్ష పార్టీలు మరింత బలహీనపడ్డాయి. 2018 శాసనసభ ఎన్నికల లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 19 శాసనసభ స్థానాలలో విజయం సాధించినప్పటికీ 13 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరా యించటం వలన ఆ పార్టీ శాసనసభలో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది.

సభలో ప్రతిపక్ష పార్టీల బలం పట్టుమని పదిమం ది కూడా (6 కాంగ్రెస్+3 బిజెపి) లేకపోవ డం వలన శాసనసభ సమావేశాలలో ప్ర జలపక్షాన ప్రతిపక్షాలు బలమైన గొంతు వినిపించ లేకపోవడంతో సభలో అధికార పార్టీ ఆధిపత్యమే కొనసాగింది. ఒక దశా బ్దం పాటు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పాలక పక్షానిదే పైచేయి కావటం, ప్రతిపక్ష పార్టీల బలహీన ప్రతిఘటనతో ప్రభుత్వానికి ఎదురులేకుండా పోయింది. శాసనస భ సమావేశాలలో ప్రజా సమస్యలపై పెద్ద గా చర్చించిన దాఖలాలు లేవు. బిల్లులు ఆమోదించడానికే సమావేశాలు జరుగుతున్నాయా అనే అభిప్రాయం కలిగేది.

2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎ న్నికలలో గతానికి భిన్నంగా బలమైన ప్రతిపక్షం ఏర్పడిందనే చెప్పాలి. ప్రస్తుత శాసన సభలో కూడా దరిదాపు పదిమంది ప్రతిపక్ష శాసనసభ్యులు అధికార పక్షంలోకి ఫి రాయించినా బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులతో కలిపి శాసనసభలో బలమైన ప్రతిపక్షం ఉంది. కానీ సభలో పాలక, ప్రతిపక్ష పార్టీ లు ఒకరిపై మరొకరు రాజకీయంగా పైచే యి సాధించటానికి  సమావేశాలను ఉపయోగించుకుంటున్నారు.

సభలో రాష్ట్ర సమస్యలపైన, ప్రజా అవసరాలపైన పెద్ద గా చర్చిస్తున్న దాఖలాలు కనపడటం లే దు. గత ప్రభుత్వ తప్పిదాలను ప్రస్తుత ప్ర భుత్వం ఎత్తి చూపుతుంటే, ప్రస్తుత ప్రభు త్వ విధానాలను ప్రతిపక్షం తప్పుపడుతు న్న క్రమంలో రాజకీయ ఆరోపణలే తెరపైకి వస్తున్నాయి. కానీ ప్రజా సమస్యలపై న పెద్దగా చర్చ జరగటం లేదు. అలాగే స మస్యల పరిష్కారానికి సూచనలూ లేవనే చెప్పాలి. ప్రజాధనంతో జరిగే సమావేశాలలో ప్రజల సమస్యలు చర్చకు రాకపోవ టం విచిత్రం.

ప్రతిపక్ష వైఫల్యం 

రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు స భలో చర్చకు రాకపోవటం ఒకటైతే, మరొకవైపు చర్చకు వచ్చిన అంశాలపై కూడా వి పక్షాలు బలమైన వాదనను వినిపించలేకపోతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత సభ కు హాజరు కాకపోవటం వలన రాజులేని రాజ్యం కోసం సైనికులు యుద్ధం చేస్తున్నట్టుగానే సభలో కనబడింది. సభ ముందు కు చర్చకు వచ్చిన అంశాలలో కూడా ప్ర ధాన ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఇరుకున పెట్టలేకపోయింది.

బలమైన ప్రతిపక్షం ఉ న్నా ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై ఇరుకు న పెట్టే వ్యూహం లేకపోవడం వలన ప్రతిపక్ష వైఫల్యం సభలో స్పష్టమైంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌పై ఫా ర్ములా ఈ- కార్ రేసింగ్ అవినీతి ఆరోపణలపై ప్రతిపక్షం సభలో చర్చకు పట్టుపట్టి నా సాధించుకోలేకపోయింది. లగచర్ల, మూసీ ప్రక్షాళన, హైడ్రా, రుణమాఫీ, రైతు భరోసా, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజన్ లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అవకాశం ఉన్నా ప్రతిపక్షం సభలో వ్యూహాత్మ కంగా వ్యవహరించకపోవటం వలన ప్రభు త్వం సునాయాసంగా తప్పించుకోగలిగిం ది. 6 గ్యారంటీలు, రేషన్ కార్డులు, పెన్షన్‌ల పెంపులాంటి ముఖ్యమైన అంశాలను ప్రతిపక్షం సభలో ప్రస్తావించకపోవడం వైఫల్యంగానే చూడాలి. 

పాలకపక్షం పైచేయి 

శాసనసభ శీతాకాల సమావేశాలలో అ ద్యంతం ప్రభుత్వానిదే పైచేయిగా కనిపించింది. ధరణి స్థానంలో భూ భారతి బిల్లు ను ఆమోదించటం, రైతు భరోసా, రుణమాఫీ విషయాలపై సభలో విస్తృతమైన చర్చ జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడిందనే చెప్పాలి. హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజన్, లగచర్ల, హైడ్రా, మూసీ లాంటి అంశాలపై కూడా సభలో ప్రభుత్వానిదే పైచేయిగా మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన మొ దటి సమావేశాల నుండి ప్రభుత్వం వ్యూ హాత్మకంగా గత ప్రభుత్వం చేసిన అప్పుల ను తెరపైకి తెచ్చి ప్రతిపక్షాన్ని ఇరుకున పె డుతూ సభలో పైచేయి సాధిస్తోంది.

ఈ శీ తాకాల సమావేశాలలోకూడా మొదటినుండి చివరిరోజు వరకు  గత ప్రభుత్వం చేసిన అప్పులే ప్రధాన అంశం. సహజంగా సభలో ప్రతిపక్షం చేసే ఆరోపణలకు పాల క పక్షం వివరణ ఇవ్వాలి. కానీ ఈ శీతాకాల శాసనసభ సమావేశాలలో ప్రభుత్వ మే గత ప్రభుత్వ విధానాలపై విరుచుకు ప డటం వలన ప్రతిపక్షం ఒకింత ఆత్మ రక్షణ లో పడిపోయింది. చివరిరోజు సభలో ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘గత ప్రభుత్వం చేసిన7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ కట్టడానికే సరిపోతోంది.

నా టి ప్రభుత్వం చేసిన అప్పులవల్లనే ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నా, రైతు భరోసా ఇవ్వలేకపోతున్నా, హాస్టల్స్ లో పిల్లలకు మంచి ఆహారం పెట్టలేకపోతున్నా’ అని గత పాలనపై విరుచుకు పడు తుంటే ప్రధాన ప్రతిపక్షం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయిందనే చెప్పాలి. 

ప్రజాస్వామ్యంలో పాలక పక్షంకంటే ప్రతిపక్షానికే ప్రజల పక్షాన క్షేత్రస్థాయిలో నూ, చట్టసభలలోనూ పోరాడే బాధ్యత ఎ క్కువగా ఉంటుంది. చట్టసభలలో కీలక అంశాలపై, సమస్యలపై చర్చించటానికి పా లక పక్షాలు ముందుకు రావడం లేదనేది వాస్తవం. చట్టసభలలో అర్థవంతమైన చ ర్చలు జరగటం లేదనేది కూడా అంతే ని జం. ఎన్నిక అవుతున్న వారు కూడాసభ లో వివిధ అంశాలపై చర్చించటానికి, సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనటానికి బ దులుగా గొడవలు సృష్టించటానికి, దూషణలకు దిగటానికి ప్రాధాన్యత ఇవ్వటం వ లన చట్టసభలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మరీ విచిత్రమై న పరిస్థితి నెలకొంది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది శాసనసభ్యులు సభకు హాజరు కాకపోవటం వలన అక్కడ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రశ్నించే వారే లేరు. శాసనసభ్యులు సభ కు హాజరుకాకుండా జీతాలు ఎలా తీసుకుంటారు, వారి నియోజకవర్గ ప్రజల సమస్యలు సభ దృష్టికి ఎలా తీసుకెళ్తారు? ప్రజల పక్షాన సభకు వెళ్లటం, ప్రశ్నించటం ప్రజాప్రతినిధుల బాధ్యత.

డైవర్షన్ పాలిటిక్స్‌కు వేదికలుగా చట్టసభలను ఉపయో గించటం కూడా ఆహ్వానించదగిన పరిణామం కాదు. అంబేద్కర్‌పై వివాదం రేకెత్తిన సమయంలో ఎంపీలపై దాడిని తెరపైకి తేవటం, తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ గురుకుల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ వలన మరణించిన శైలజ అంశం చర్చకు రాకుండా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మరణించిన రేవతి అంశం చర్చకు రావటం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే చూడాలి. చట్టసభలలో అర్థవంతమైన చర్చ జరగకపోతే చట్టసభలు తమ ప్రతిష్ఠను కోల్పోవడమే కాదు ప్రజా సమస్యలకు పరిష్కారం కూడా దొరకదనే విషయాన్ని పాలక, ప్రతిపక్షాలు గమనిస్తే మంచిది.