calender_icon.png 14 April, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తనఖా వెనకున్న చీకటికోణమేంటి?

13-04-2025 01:57:51 AM

  1. కంచ గచ్చిబౌలి 400 ఎకరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  2. టీజీపీఎస్సీ అన్యాయాలపై ప్రశ్నిస్తే రాకేశ్‌రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తారా?
  3. మాజీమంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): టీజీఐఐసీ ద్వారా కంచ గచ్చిబౌలి 400 ఎకరాలు భూమిని తనఖాపెట్టి రుణం పొందామని తా ను అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ప్ర భుత్వం సమాధానం చెప్పిందని, మరి నేడు ఐసీఐసీఐ బ్యాంకు తా ము తనఖా పెట్టుకోలేదని అని చె ప్తోందని మాజీమంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా శనివారం ప్రశ్నించారు.

ఈ మేరకు అసెంబ్లీ ప్రశ్నా వళి, బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనను పోస్టు చేశారు. ఆ 400 ఎక రాల భూమిని ప్రభుత్వం ఎవరి దగ్గ ర తనఖా పెట్టిందో చెప్పాలని, రేవంత్ తన బ్రోకర్ కంపెనీలకు తన ఖా పెట్టారా అని ప్రశ్నించారు. 400 ఎకరాల తనఖా విషయంలో దాగు న్న చీకటి కోణం ఏమిటన్నారు. ప్ర భుత్వం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

అన్యాయాన్ని ప్రశ్నిస్తే పరువునష్టం దావా వేస్తారా?

బీఆర్‌ఎస్ నేత రాకేశ్‌రెడ్డికి టీజీపీఎస్పీ పరువునష్టం దావా నోటీ సులు ఇవ్వడంపై హరీశ్‌రావు స్పం దించారు. ఇది కక్ష సాధింపు చర్యేనని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థుల తరపున అన్యాయాన్ని ప్రశ్నిస్తే పరువు నష్టం దావా వేస్తారా? అని ప్రశ్నించారు.

ప్రజాప్రభుత్వం అంటూనే ని యంతృత్వ పాలన కొనసాగిస్తున్నారా? అని నిలిదీశారు. ఆరోపణ లు వస్తే వాస్తవాలు బయటపెట్టాల్సింది పోయి నిరంకుశంగా వ్యవహ రించడం ఏమిటని అన్నారు. బెదిరింపులకు భయపడమని, న్యాయప రంగా కేసులు ఎదుర్కొంటామని తెలిపారు. 

సమాధానం చెప్పలేక నోటీసులా?: ఆర్‌ఎస్‌పి

నిరుద్యోగుల బాధలను టీజీపీఎస్సీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని రాకేశ్‌రెడ్డి చేశారని, ఆరోపణలకు సమాధానం చెప్పాలి గానీ, పరువునష్టం నోటీసులు ఎలా ఇస్తారని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఎలాంటి అవకతవకలు జరుగకపోతే వాటి ఆధారాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డికి ప్రతీకార పాలన ఆనవాళ్ల నిర్మూలన వైరస్ సోకినట్టుందని ఎద్దేవా చేశారు.