calender_icon.png 2 October, 2024 | 7:57 AM

ప్రజా పాలన, ఫామ్‌హౌస్ పాలనకు పోలికా?

02-10-2024 01:20:14 AM

ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ప్రభు త్వంపై సోషల్ మీడియాలో అస త్య ప్రచారాలు చేస్తున్న గత ఫామ్‌హౌస్ పాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు పోలికే లేదని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. రైతులను పట్టించుకోని బీజేపీ సిగ్గు లేకుం డా ధర్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు కబ్జాలకు గురైతే..

వాటి మీద హైడ్రా తీసుకుంటున్న చర్యలను యాక్టర్లయిన కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు బీజేపీ నాయకులు కూడా తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో అక్రమంగా 28 వేల కట్టడాలు ఉన్నాయని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో మూసీ కింద వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, వాటిని కొనే పరిస్థితి లేదని తెలిపారు.

మూసీలోని వ్యర్థ్థాల వల్ల అక్కడ పండిన పంటలు, పెంచిన చేపలను ఎవరూ కొనరని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మ డి నల్లగొండ జిల్లా మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పర్యటనలు చేస్తే చెట్టుకు కట్టేసి కొట్టాలని మూసీ ప్రాంత రైతులకు పిలుపునిచ్చారు. ఇక గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం మూసీ ప్రక్షాళన అని మేనిఫెస్టోలో పెట్టి, దానికి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు కూడా కేటాయించి చిన్న పని కూడా చేయలేదని ఆరోపించారు.