calender_icon.png 19 January, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ లెక్కకు ఆ లెక్క!

19-01-2025 12:52:23 AM

బీజేపీపై గల్లీలోనే కాకుండా ఢిల్లీలోనూ విమర్శలకు ఎక్కుపెడుతున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రు లు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆయా ప్రాజెక్టుల మంజూరు విషయ మై సెంట్రల్‌లోని బీజేపీ సర్కార్‌తో ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏకంగా ప్రధాని మోదీపైనే విమర్శలు చేసిన  రేవంత్‌రెడ్డి.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే దూకుడు ప్రదర్శించారు.

ఆ తర్వాత క్ర మం తప్పకుండా ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను ఢిల్లీలో కలుస్తూ రాష్ట్రానికి ప్రాజెక్టులు మంజూరు చేయాలని, నిధులు ఇవ్వాలని కోరారు. తాజాగా ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో రాజధాని గడ్డపై కేంద్రంపై విమర్శలు సంధించిన ఆయన, ప్రచారం ముగిసిన వెంటనే వెళ్లి కేంద్రమంత్రులను కలిశారు.

ఇదంతా గమనిస్తున్న రాజకీయ విమర్శకులు సీఎం రేవంత్ తీరును వేనోళ్లా పొగుడుతున్నారు. కేసీఆర్‌లా భేషజాలకు పోకుండా ఓ వైపు విమర్శలకు ఎక్కుపెడుతూనే.. తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎక్కడా తగ్గకుండా కేంద్ర మంత్రివర్గాన్ని కలుస్తున్నారని మెచ్చుకుంటున్నారు.             

  పెద్ది విజయభాస్కర్