23-02-2025 12:00:00 AM
కొందరు భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడానికి ఇష్టపడితే.. మరికొందరు ఖాళీ కడుపుతో నే చేస్తున్నారు. అయితే ఖాళీ కడుపుతో నడవడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయని భావిస్తున్నారు. అయితే నిజానికి ఏది ఎక్కువగా ప్రభావం చూపిస్తుందో మీకు తెలుసా.. నడకను గొప్ప వ్యాయామంగా అభివర్ణిస్తారు ఫిట్‌నెస్ ప్రియులు.
ఇది కేలరీలను బర్న్ చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, జీవక్రియనూ పెంచడానికి సహాయపడుతుంది. ‘ఎవరైనా బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఖాళీ కడుపుతో నడవడం ఎల్లప్పుడూ మంచిది. దీనిని ఫాస్టింగ్ కార్డియో అని అంటారు’ అని వైద్యులు చెప్తున్నారు. అయితే భోజనం తర్వాత నడక కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందట. ‘ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇది మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకతతో బాధపడేవారికి బాగా పనిచేస్తుంది’ అంటున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో నడకతో పోలిస్తే ఇది తప్పనిసరిగా ఎక్కువ కొవ్వును బర్న్ చేయలేకపోయినా.. భోజనం తర్వాత 10- నిమిషాలు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉబ్బరం నివారిస్తుంది. అయితే ఖాళీ కడుపు నడకతోనే అధిక శాతం కొవ్వును తగ్గించుకోవచ్చునని చాలామంది డాక్టర్లు సూచిస్తున్నారు.