calender_icon.png 30 January, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో బీసీ నాయకతం ఏది?

30-01-2025 12:22:27 AM

  1. ఆదిలాబాద్‌లో పార్టీకి దూరం అవుతున్న బీసీలు
  2. డీసీసీ పదవులైనా దక్కేనా?

ఆదిలాబాద్, జనవరి 2౯ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకతం ఎక్కడా అనే చర్చ జరుగుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సి  మంచిర్యాల జనరల్ స్థానాలు.

బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎస్టీ స్థానాలు. బెల్లంపల్లి, చెన్నూర్ ఎస్సీ స్థానాలుగా ఉన్నా  పది స్థానాల్లో కేవలం నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ నా  బీఆర్‌ఎస్ రెండు స్థానాలను కైవ  చేసుకుంది.

ఐదు జనరల్ నియోజకవర్గాల్లో కేవలం ముథోల్‌లో మాత్రమే కాం  నుంచి బీసీ వర్గానికి చెందిన నారాయణరావు పటేల్ దక్కింది. అక్కడ సైతం ఆయ  ఓటమిపాలయ్యారు. అటు పార్టీ పదవుల్లో సైతం ఓసీల అధిపత్యమే ఉండటంతో బీసీ నేతల్లో నిరుత్సాహం నెలకొంది. 

నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా ఓసీలే

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గెలుపొందిన అసెంబ్లీ స్థానాలతో పాటు పార్టీ ఓడి   నియోజకవర్గాల్లో సైతం బీసీలు ఇన్‌చార్జిలు లేదు. ఓసీల ఆధిపత్యమే కొనసా  ఆదిలాబాద్ నియో   కంది శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోగా, ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఆయనే కొన  నిర్మల్‌లో శ్రీహరిరావు కాం  నుంచి పోటీ చేసి ఓడిపోగా, ప్రస్తుతం ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.

మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సతీమణి సురేఖ డీసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సిర్పూర్‌లో రావి శ్రీనివాసరావు పోటీ చేసి ఓడిపోగా, ప్రస్తుతం ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. అసిఫాబాద్ నుంచి శ్యామ్ నాయక్ పోటీ చేసి ఓడిపోగా, ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా విశప్రసాద్‌రావు కొనసాగుతున్నారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురు దెబ్బ

ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం ఎస్టీ రిజర్ కావడంతో కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ పోటీలో నిలిచారు. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కేవలం ఒక్క ముథోల్ నియోజకవర్గంలోనే బీసీ నాయకుడు ఇన్‌చార్జి ఉండగా, మిగితా 9  నియోజకవర్గాల్లో ఓసీ, ఎస్సీ, ఎస్టీలు ఇన్‌చార్జిలుగా ఉండటంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్‌కు దూరమయ్యారనే ప్రచారం కొనసాగింది.

దీంతో బీసీ ఓటర్లు బీజేపీకి మద్దతు పలికినట్లు సమాచారం. నాలుగు జిల్లాల డీసీసీ పదవుల్లో ఓసీల ఆధిపత్యమే ఉన్నది. ఆదిలాబాద్ డీసీసీ పదవి కోసం రెడ్డి సామాజిక వర్గానికి వారే పోటీ పడుతున్నారు. డీసీసీ అధ్యక్షులుగా బీసీలకు కట్టబెట్టి కాంగ్రెస్ పార్టీ వారికి దగ్గరయ్యేనా అనే చర్చ పార్టీలో మొదలయ్యింది.

ఆదిలాబాద్‌లో బీసీలు దూరం

ఆదిలాబాద్ నియోజకవర్గం బీసీ నేతలకు పట్టున్న స్థానం. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీసీలను కాదని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కంది శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ కేటాయించడంతో బీసీలు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్ నాయకురాలు గండ్రత్ సుజాతను పార్టీ నుంచి బహిష్కరించడంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దెబ్బ తగిలింది. నిర్మల్ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్‌లో బీసీ నాయకుడు లేకపోవడంతో బీసీ వర్గీయులు బీజేపీకి మద్దతు పలికారు.