calender_icon.png 2 October, 2024 | 4:13 AM

హైడ్రాపై ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలి

02-10-2024 01:00:28 AM

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

హనుమకొండ, అక్టోబర్ 1(విజయక్రాంతి): హైడ్రాపై ప్రజలు భయాందో ళనలకు గురవుతున్నందున దాని పరిధి, పరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

హైడ్రా మిస్‌ఫై ర్ అయినట్లు కనిపిస్తోందని, దానిని విధ్వంసానికి కాకుండా అభివృద్ధికి, వికాసానికి వినియోగించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో చెరువులు, కుంటలు ఎన్ని ఉన్నాయో, ఎక్కడ ఆక్రమణలు జరిగాయో అనే విషయమై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కొందరు పెద్దలు వాటిని ఆక్రమించి విల్లాలు, ఫాం హౌస్‌లు, కన్వెన్షన్‌లు నిర్మిస్తే మరికొన్ని చోట్ల పేదలు అన్ని అనుమతులు తీసుకుని ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారని తెలిపారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూసీ ఆక్రమణలు హైడ్రా పరిధిలోకి రావని చెప్ప డం సంతోషమేనని, అలాగే హై కోర్టు పేదల ఇండ్ల కూల్చివేతలపై చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఆయన కోరారు. పేదలకు జీఓ 58,59 ప్రకా రం ఇండ్లు క్రమబద్ధీకరించాలని కోరారు.