calender_icon.png 1 October, 2024 | 2:04 AM

ఏది హేతుబద్ధీకరణ?

01-10-2024 12:03:23 AM

విద్యార్థుల సంఖ్య ఆధారంగా జరగని టీచర్ల కేటాయింపు?

100కి పైగా ప్రాథమిక పాఠశాలల్లో ఇదే తంతు

విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపి బదిలీలు?

సూర్యాపేట, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలోని పలు  ప్రాథ మిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధార ంగా ఉపాధ్యాయుల కేటాయింపు జరగలేద ని తెలుస్తున్నది.

తక్కువ సంఖ్యలో విద్యార్థు లు ఉన్న చోట ఎక్కువ మంది ఉపాధ్యాయు లు, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నట్టు వి ద్యాశాఖకు అందుతున్న రోజువారి విద్యార్థు ల హాజరు లెక్కలే చెబుతున్నాయి. టీచర్ల బ దిలీలకు ముందు కొన్ని పాఠశాల ల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నట్టు లెక్కచూపి ఎ క్కువ మంది టీచర్లను కేటాయించారని తెలుస్తున్నది.

దీని వెనుక జిల్లా విద్యాశాఖ అధికా రుల హస్తం ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ల కేటాయింపు జరగలేదని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాం టి పరిస్థితి ఉన్నదని, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహరెడ్డి సెప్టెంబర్ 20న గైడ్‌లై న్స్ విడుదల చేశారు.

అదే నెల 23 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాల్లో నేర్కొన్నారు. కానీ సూర్యాపేట జిల్లాలో ఈ ప్రక్రియ సజావుగా జరగలేదని ఆరోపణలొస్తున్నాయి. 

ఇవీ నిబంధనలు..

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (పిల్లల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల కేటాయి ంపు)లో భాగంగా 2015లో అప్పటి ప్రభు త్వం జీవో 17, 2021 జీవో 25ను విడుదల చేసింది. ఈ జీవోల ప్రకారం 0-19 మంది వరకు విద్యార్థులు ఉంటే ఒక టీచర్, 20-6 0 వరకు ఉంటే ఇద్దరు, 61-90 వరకు ఉం టే ముగ్గురు, 90-120 వరకు ఉంటే నలుగురు, 121-150 వరకు ఉంటే ఐదుగురు, 1 51 వరకు ఉంటే ఆరుగురు, 20 1-240 వరకు ఉంటే ఏడుగురు, 241 -280 వరకు ఉంటే ఎనిమిది మంది ఉపాధ్యాయులను కేటాయించాలి.

360 మందికి పైగా ఉంటే 11 మంది టీచర్లు ఉండాలి. ప్ర స్తుత ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలిల్లో విద్యార్థుల సంఖ్య ఆధారం గా ఉపాధ్యాయులను కేటాయించాలని నిర్ణయించింది. పది లోపు పిల్లలుంటే ఒక ఉపా ధ్యాయుడు, 11- 40 వరకు ఉంటే ఇద్దరు, 41-60 వరకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేలా ఖాళీలు చూపాలని ఆదేశించింది. ఎస్‌జీటీ బదిలీల సమయంలో ఇదే విధంగా ఖాళీలు సూచించారు. ఖాళీల ఆధారంగా ఉ పాధ్యాయుల కేటాయింపు చేపట్టారు. అయి తే జిల్లాలో ప్రసుత్త ఉపాధ్యాయుల సంఖ్య మేరకు విద్యార్థులు లేరు.

కోరుకున్న స్థానం కోసమే?

గత కొన్ని రోజుల క్రితం జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ జరిగింది. ఈ సమయం లో ఆయా పాఠశాలల నుంచి విద్యార్థుల స ంఖ్యను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ప ంపించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఖాళీల జాబితాను ప్రదర్శించిన ట్లు ఆ శాఖ ఉద్యోగులు తెలుపుతున్నారు.

అయితే ఇదే సమయంలో  పట్టణానికి దగ్గరగా ఉన్న మండలాల్లో తమకు అనుకూలం గా ఉన్న పాఠశాలల్లో చేరాలని నిర్ణయించుకున్న కొందరు ఉపాధ్యాయులు ఆయా మ ండల అధికారులతో కలిసి ఆయా పాఠశాల ల్లో విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపి బ దిలీ చేయించుకున్నట్టు ఆరోపణలు ఉన్నా యి.

ఇప్పుడు ఆ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు రోజువారీగా అం దిస్తున్న విద్యార్థుల హాజరును చూస్తే ఆరోపణలు నిజమేనని తెలుస్తున్నది. కలెక్టర్ చొ రవ చూపి విద్యార్థుల సంఖ్యకు అనుగుణం గా టీచర్ల సర్దుబాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

ప్రాథమిక పాఠశాలల్లోనే సమస్య

జిల్లాలో మెత్తం 690 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 100కు పైగా బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల కేటాయింపు జరుగలేదు. కొన్ని పాఠశాలల్లో 3-4 మంది విద్యార్థులకు కూడా ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. సుమారు 70 పాఠ శాలల్లో 10లోపు విద్యార్థులుండగా ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. 

అనంతగిరి మండలం అజ్మీరతండాలో ఐదుగురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, కొత్తగూడెంలో ముగ్గురు విద్యా ర్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఆత్మకూర్(ఎస్) మండలం బోట్యతండాలో 8 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, పొట్టిసూర్యాతండా, లక్ష్మాతండాలో 9 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ఖాశీగూడెంలో ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు.

చిలుకూర్ మండలం చెన్నారీగూడెం పాఠశాలలో 9 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, మాధవగూడెంలో ఐదుగురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. చివ్వెంల మండలం బోడ్యాతండా, గుడితండాలో ఇద్దరు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, రోళ్లబండతండాలో ముగ్గురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, బోత్యతండా, పందిబండతండాలో నలుగురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యా యులు ఉన్నారు.