15-02-2025 01:58:26 AM
సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. మోదీ ముమ్మాటికీ బీసీనే. కానీ వారి పార్టీ అధినేత రాహుల్‌గాంధీ ఏ కులానికి చెందినవారో ముందు ఆయన చెప్పాలి. 42 శాతం బీసీ రిజర్వేషన్ల నుంచి మరో దారిమళ్లింపు ప్రయత్నంలో భాగంగానే రేవంత్‌రెడ్డి ప్రధాని కులంపై వ్యాఖ్యలు చేశారు. 1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రధానమంత్రి మోదీ ఓబీసీగా జాబితాలో ఉన్నారు.
అసలు వారి పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు.. ఆయన మతం ఏది.. ఆ విషయం రాహుల్ గాంధీకేనా.. మీకు కూడా తెలియదా... రాహుల్‌గాంధీ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ. హిందూ సంప్రదాయంలో కులం తండ్రి ద్వారా వస్తుంది. ఇప్పుడు ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారనే అంశంపై చర్చ పెట్టాలంటే ముందు 10, జనపథ్ నుంచి ప్రారంభించాలని రేవంత్‌రెడ్డి గుర్తించాలి. రేవంత్‌రెడ్డి ఎంత ప్రయత్నించినా ఆయన ఇచ్చిన హామీలపై దృష్టి మళ్లించడం సాధ్యంకాదు.
కేంద్రమంత్రి బండి సంజయ్