calender_icon.png 15 November, 2024 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా వైఫల్యమేమిటి కేటీఆర్?

15-11-2024 01:59:12 AM

  1. ప్రజలకు మంచి చేయడమే ప్రభుత్వ వైఫల్యమా?
  2. బీఆర్‌ఎస్ దృష్టంతా  మా ప్రభుత్వాన్ని కూల్చడంపైనే
  3. ఫార్మా క్లస్టర్స్ విస్తరణను అడ్డుకోవడం బుద్ధితక్కువ పని
  4. సంక్షేమ పథకాలను పెంచేందుకే సర్వే 
  5. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): తమ ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్‌ఎస్ దృష్టి అంతా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రతిపక్షంగా ఆ పార్టీ తన పాత్ర పోషించడం లేదన్నారు. గురువారం గాంధీభవన్‌లో నిర్వహించిన నెహ్రూ జయంతి వేడుకల్లో భట్టి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫార్మా క్లస్టర్స్ విస్తరణను వ్యతిరేకించడాన్ని బుద్ధి తక్కువ పనిగా అభివర్ణించారు. తమ పార్టీ కక్ష పూరిత రాజకీయలకు వ్యతిరేకమన్నారు.

కేటీఆర్ గురించి తాము చెప్పాలంటే చాలా మాట్లాడొచ్చన్నారు. తమ సర్కారు వైఫల్యం ఏంటో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ వైఫల్యమా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం, రైతు రుణమాఫీ, ప్రజలకు మంచి చేయడమే ప్రభుత్వ వైఫల్యమా? అని నిలదీశారు. రాష్ర్ట అభివృద్ధికి కులగణన ఎంతగానో ఉపయోగపడుతుందని భట్టి అన్నారు.

పథకాలు పెరగడానికే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామని చెప్పారు. కులగణన చేస్తామని మాట ఇచ్చామని, ఆ మాటను నిలబెట్టుకున్నామని  అన్నారు. కులగణనతో దేశానికి తె లంగాణ రోల్ మోడల్ కాబోతుందన్నారు. ఇదొక విప్లవాత్మక నిర్ణయమ ని చెప్పారు.

నెహ్రూపై తప్పుడు ప్రచారం..

దేశానికి తొలి ప్రధాని నెహ్రూ నిర్ణయాలతోనే భారత్ ప్రపంచ స్థాయిలో నిలిచిందని డిప్యూటీ సీఎం అన్నారు. నెహ్రూ గురించి కొందరు కుహనా మేధావులు కొందరు తప్పుడు ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు. చం ద్రమండలం, మార్స్‌పైకి రకరకాల శాటిలైట్స్ పంపి సమాచార వ్యవస్థలో పోటీకి కారణం నాటి నెహ్రూ నిర్ణయాలే అన్నారు.

విద్యా విధానం, వ్య వసాయం, పారిశ్రామిక రంగాలు ప్ర భుత్వ రంగంలోనే ఉండాలన్న ఆయ న నిర్ణయం, ఆలోచనల ఫలితంగానే భారత్ నేడు మనుగడలో ఉన్నదన్నా రు. సైంటిఫిక్ ఆలోచనలు లేని మోదీ లాంటి వారు నాడు ప్రధానిగా ఉంటే ఈ దేశం మూఢవిశ్వాసాలతో ఎక్కడో వెనుకబడి ఉండేదన్నారు. నెహ్రూ వే సిన పునాదుల ఫలాలు నేడు అంద రూ అనుభవిస్తున్నారని చెప్పారు.