calender_icon.png 18 April, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏం బతుకురా నాది..

18-03-2025 12:00:00 AM

యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్  ‘పాంచ్ మినార్’. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌బీ బ్యానర్ పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా ఫస్ట్ సింగిల్ మిడిల్ క్లాస్ ఆంథమ్ ‘ఏం బతుకురా నాది’ సాంగ్ విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

శేఖర్ చంద్ర ఈ పాటను క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేశారు. దినేష్ రుద్ర పాడిన స్టయిల్  ఆకట్టుకుంటోంది. హీరో క్యారెక్టర్‌ని ప్రజెంట్ చేస్తూ అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సాంగ్‌లో రాజ్ తరుణ్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.