calender_icon.png 20 January, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమంటే? మొదలైంది

20-01-2025 12:15:23 AM

ప్రియదర్శి మరో కొత్త చిత్రంతో అలరించబోతున్నాడు. ఆనంది, సుమ కనకాల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. ‘ప్రేమంటే?’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ‘థ్రిల్-యూ ప్రాప్తిరస్తు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

రానా దగ్గుబాటి క్లాప్ ఇవ్వగా, సందీప్‌రెడ్డి వంగా ముహూర్తపు షాట్ కోసం కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. సునీల్ నారంగ్, భరత్ నారంగ్, అభిషేక్ నామా, సుధాకర్‌రెడ్డి, రామ్‌మోహన్‌రావు, జనార్దన్‌రెడ్డి, విజయ్‌కుమార్, శ్రీధర్ మూవీ లాంచింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ ఈ చిత్రానికి డీవోపీ: విశ్వనాథ్‌రెడ్డి; సంగీతం: లియోన్ జేమ్స్; ఎడిటర్: అన్వర్ అలీ.