calender_icon.png 24 February, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరికి మిగిలిందేంటి?

24-02-2025 12:00:00 AM

జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 23:  జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బిజెపి సీనియర్ నేత ముదిగంటి రవీందర్ రెడ్డి నడుమ ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భా గంగా ఆదివారం వీరిద్దరూ జగిత్యాల గ్రౌం డ్లో కలిశారు. వారి వారి పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఈ సందర్బంగా త మ భవిష్యత్ రాజకీయ జీవితం గురించి జీవ న్ రెడ్డి చేసిన కామెంట్స్ స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

ఇద్దరం మన పార్టీ ల  బలోపేతానికి సుధీర్ఘ కాలంగా కృషి చేస్తు న్నా.. గడ్డి పోచలా తీసిందన్నారు. మనల్ని కాదని మరొకరికి ప్రయార్టీ ఇచ్చారని జీవన్ రెడ్డి బాహాటంగా చెప్పడం తో నా పరిస్థితి ఇ లానే ఉందని ముదుగంటి అన్నా రు.. ఇది లా ఉండగా గతంలో రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన రవీందర్ రెడ్డికి లాస్ట్ ఎన్నికల్లో మొండి చెయ్యి చూపి భోగ శ్రావణికి టికెట్ ఇవ్వడం తో ర వీందర్ రెడ్డి వర్గం తీవ్ర ఆవేదనకు గురైంది.

మరో వైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎం.సంజయ్’కుమార్ ఇటీవల కాంగ్రెస్ లో చేరడం తో జీవన్ రెడ్డి వర్గీయుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఇద్దరూ తమ రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేయడంతో కా ర్యకర్తలు అవాక్కయ్యారు. భవిష్యత్‌పైనే ఆ శలు అంటూ అక్కడి నుండి  వెళ్లిపోయారు.