ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): పోలీసు శాఖలో అంతులేని వివక్ష కొనసాగుతుందని, ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైందని బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశా రు. ఆదివారం ఎక్స్ వేదికగా స్పంది స్తూ ఏడు పోలీసుస్టేషన్లలో ఎస్సైగా పనిచేసిన ఒక అధికారికి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే శాఖలో కనిపించని వివక్ష ఎంతో ఉందన్నారు. దానిని ఉన్నతాధికారులు క్రమశిక్షణ పేరుతో దాచి పెడు తారని ఆరోపించారు. ఈవిషయం అనేక మంది పేద వర్గాలకు చెందిన పోలీసులు తెలిపారని అన్నారు. శ్రీను విషయంలో కూడా మేం అడిగే దాకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, సీఎం ఈ కుటుంబానికి ఏం సమాధానం చెబుతారని, బడితే (కర్ర) ఉన్నోనిదే బర్రె అంటారా? అని ప్రశ్నించారు.