ఆ వేధింపులకు నేనే ప్రత్యక్ష సాక్షిని!
జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ మాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. తెర వెనుక జరిగే లైంగిక వేధింపులను బట్టబయలు చేయడంతో ఎంతోమంది నటీమణులు మీడియా ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటులు ఎం.ముఖేష్, జయసూర్యలపై మలయాళ నటీమణులు మిను మునీర్, గీతా విజయన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. మళయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ)లో దర్శకుడు రంజిత్, నటుడు సిద్ధిఖీ తమ పదవులకు రాజీనామా చేసిన మరుసటి రోజే ఈ ఆరోపణలు రావడం హాట్ టాపిక్‌గా మారింది.
2013లో ఓ సినిమా సెట్‌లో నలుగురు నటులు ముఖేష్, మణియంపిల్ల రాజు, ఇడవెల బాబు, జయసూర్య తనను శారీరకంగా, మాటలతో వేధించారని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నటి మీడియాతో పంచుకున్నారు. “ఓ సినిమా షూటింగ్ సమయంలో నాకు చేదు అనుభవం ఎదురైంది. నేను టాయిలెట్‌కు వెళ్లి బయటకు రాగానే జయసూర్య నన్ను వెనుక నుంచి కౌగిలించుకుని నా అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నాడు. నేను షాక్‌కు గురయ్యా. నేను బయటకు పరిగెత్తాను‘ అని ఆమె చెప్పింది మునీర్. అతనితో ఉండటానికి ఒప్పుకుంటే తనకు మరిన్ని సినిమా అవకాశాలు ఇస్తానని ఆఫర్ చేశాడని ఆరోపించింది.
మరో ఘటనలో మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) కార్యదర్శి ఇడవెల బాబును మెంబర్షిప్ అప్లికేషన్ కోసం సంప్రదించాను. ఫిల్మ్ అసోసియేషన్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంటానని చెప్పి తనను తన ఫ్లాట్ కు పిలిపించుకుని శారీరకంగా హింసించాడని ఆమె తెలిపింది. అధికార సిపిఐ(ఎం) ఎమ్మెల్యే అయిన నటుడు ముఖేష్ తన అడ్వాన్సులను తిరస్కరించడంతో తనకు సభ్యత్వం నిరాకరించారని మునీర్ చెప్పారు.
‘నేను అనుభవించిన వేదనకు న్యాయం, జవాబుదారీతనం కోరుతున్నాను. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా‘ అని ఫోస్ట్ చేశారు.
పదే పదే డోర్ బెల్ కొట్టేవాడు
నటి గీతా విజయన్ కూడా తులసి దాస్‌తో తన బాధాకరమైన అనుభవా లను పంచుకున్నా రు. “తాను ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నానని, దానికి వ్యతిరేకంగా నిలబడటంతో అనేక చిత్రాల నుండి తొలగించాడు. 1991లో వచ్చిన ’చంచలం’ సినిమా చిత్రీకరణ సమయంలో తులసిదాస్ తనను నిరంతరం వేధించాడు. హోటల్ గదిలో పదేపదే డోర్ బెల్ మోగిస్తూ ఇబ్బంది పెట్టేవాడు. వేధింపుల భరించలేక చాలాసార్లు పరిపోయా. దర్శకుడు తనకు సీన్లు వివరించడానికి కూడా నిరాకరించాడు. నన్ను ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తానని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇక నటి శ్రీదేవిక కూడా అనేక వేధింపులకు గురైంది” అని గీతా విజయన్ తెలిపింది.