calender_icon.png 18 January, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి జాబ్ అంటే ?

10-08-2024 04:34:20 PM

నేటి యువతకు ఉద్యోగ పర్వంలో భాగంగా ఎన్నో పద్మవ్యూహాలను ఛేదించుకుంటూ వెళ్లాల్సిందే.. కానీ మంచి ఉద్యోగమని దేన్ని అంటారు? అనే విషయంలో సందిగ్ధత మన దేశంలో చాలా మంది యువజనులను వేధిస్తోంది.  ఆసక్తి ఉన్న రంగంలో కెరీర్ ను ఎంచుకోవాలని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఆసక్తి అంటే ఆనందాన్ని ఇచ్చేదని, పనిలో సంతోషాన్ని కలిగించేదే మంచి ఉద్యోగమని యువత భావిస్తుంటారు. కానీ అది నిజం కాదంటున్నారు. మీరు చేస్తున్న పని గొప్పది అయినంత మాత్రాన అది ప్రతి రోజూ ఆనందాన్ని కలిగించదు అని ఎన్వీడియా సీఈవో, జెసెన్ హువాంగ్,  అంటున్నారు. ఎన్నో కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. త్యాగాలు  చేయాల్సి వస్తుంది. వైఫల్యాలను తట్టుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.  ఆనందం కోసం చూసేవారు ఈ క్రమంలో ఎక్కడో ఒక చోట చేతులెత్తేసి పరాజితులుగా మిగులుతారు. పనిని ప్రేమించేవారే దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రశంసలతో , ఆత్మసంతృప్తి తో కలిగే ఆనందాన్ని పొందుతారని జేసెన్ వివరించారు.