calender_icon.png 9 March, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్సీవ్ సమస్యను కన్విన్సింగ్‌గా చూపే చిత్రమిది

06-03-2025 12:00:00 AM

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్,  తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను సందీప్‌రెడ్డి వంగా రిలీజ్ చేశారు. అనంతరం సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. “టీజర్ ప్రామిసింగ్‌గా ఉంది.  మంచి ఎంటర్‌టైనింగ్ మూవీలా అనిపిస్తోంది. అన్ని సీన్స్ నవ్వించాయి” అన్నారు. సినిమా టీజర్ విషయానికి వస్తే..- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే హీరో విక్రాంత్ మీద వర్క్ ప్రెజర్ ఎక్కువే ఉంటుంది. సాఫ్ట్ వేర్ ఫీల్డ్‌లో యూత్ లైఫ్‌కు విక్రాంత్ ఒక ఉదాహరణగా కనిపిస్తాడు. అందమైన అమ్మాయి కల్యాణి (చాందినీ చౌదరి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.

ఆమె తండ్రికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం ఉండదు. విక్రాంత్‌కు ఉన్న ఒక సమస్య కారణంగా ఈ జంట తల్లిదండ్రులు కాలేకపోతారు. దీనికోసం వైద్యుల సలహాలు, డైట్ ఫాలో అవుతూ వంద రోజుల్లో తన భార్యను ప్రెగ్నెంట్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు హీరో. 

ఈ ప్రయత్నంలో తను సక్సెస్ అయ్యాడా లేదా? అనేది టీజర్‌లో ఆసక్తి కలిగించింది. ఫన్, ఎమోషన్‌తో పాటు నేటితరం యూత్ ఎదుర్కొంటున్న ‘కన్సీవ్’ సమస్యను అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా కన్విన్సింగ్‌గా ఈ మూవీలో చూపించినట్లు టీజర్‌తో తెలుస్తోంది.