calender_icon.png 19 April, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొరుగువారి నీటినీ వాడేస్తే ఎలా?

17-04-2025 12:56:57 AM

  1. నల్లాలకు మోటార్లను వాడుతున్న వారిపై ఎండీ అశోక్ రెడ్డి ఆగ్రహం

రెండో రోజు కొనసాగిన మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్

ఎస్సార్ నగర్ లోని మధురానగర్లో పర్యటించిన ఎండీ అశోక్ రెడ్డి

32 ఇల్లీగల్ మోటార్లు స్వాధీనం.. 38 మందికి పెనాల్టీ విధింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16(విజయక్రాంతి) : పొరుగువారి నీటినీ మోటా ర్లు పెట్టి వాడేస్తే ఎలా అని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి పలువురు వినియోగదారులను ప్రశ్నించారు. జలమండలి చేపట్టిన మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్‌లో భాగంగా బుధవారం ఎండీఅశోక్‌రెడ్డి ఎస్సార్ నగర్ లోని మధురా నగర్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఎండీ అశోక్ రెడ్డి ఓ హాస్టల్ ప్రాం గణంలోకి వెళ్ళగా.. ఆ యజమాని తన నల్లాకు వ్యవసానికి వినియోగిం చే 2 హె పి మోటర్ తోనీటిని లాగుతున్నట్లు గుర్తించి ఆ హాస్టల్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ హాస్టల్ కు నెలవరకు నీటిని నిలిపివేసి, ట్యాంకర్ సైతం బుక్ చెయ్యకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇదే ప్రాంతంలో మరో భవనానికి సైతం వ్యవసాయ మోటార్ వాడుతూ పట్టుపడగా కనెక్షన్ తొలగించి, నెలవరకు ట్యాంకర్ కూడా సరఫరా నిలిపివేయమని ఎండీ అధికారులకు సూచించారు.  ఈ సందర్భంగా వివిధ డివిజన్లలోని పలు హాస్టల్ లు, నివాసాలలో వినియోగిస్తున్న మోటార్లను జలమండలి అధికారులు సీజ్ చేశారు.

పలుచోట్ల వ్యవసాయానికి వాడే మోటర్లతో నీటిని లాగుతున్నట్లు గుర్తించారు. బుధవారం 32 ఇల్లీగల్ మోటార్లు స్వాధీనం చేసుకుని 38 మందికి పెనాల్టీ విధించారు.  ఈ సందర్భంగా జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఈ స్పెషల్ డ్రైవ్ మరో 60 రోజుల వరకు కొనసాగుతుందని మోటార్లు బిగించి పట్టుబడితే మోటార్లు సీజ్ చేస్తారని తెలిపారు.

రెండోసారి కొనసాగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేమని, కాబట్టి వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని హెచ్చరించారు.ఈ డ్రైవ్ తో పలు ప్రాంతాల్లోత ప్రెజర్ పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న లో లైన్ వినియోగదారులు. బుధవారం జలమండలి డివిజన్ 18 పరిధిలోని లైన్ మెన్ల లతో ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు.

ఈ మీటింగ్ లో డివిజన్ లో పనిచేస్తున్న లైన్ మెన్ల వివరాలు..ఒక్కో  ఒక్కో లైన్ మెన్ ఇన్ని వాల్వ్ లను ఆపరేట్ చేస్తారో వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ జూమ్ మీటింగ్ లో జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్, ఈఎన్సీ- డైరెక్టర్ ఆపరేషన్ -2 విఎల్ ప్రవీణ్ కుమార్, జీఎం, డీజీఎం ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.