26-03-2025 12:42:34 AM
- నాణ్యత తో కూడిన కడుపునిండా భోజనం మంచి చదువు చెప్పండి
-జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహమ్మదాబాద్ మార్చి 25 : ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ మీ సొంత బిడ్డల్లా చూసుకుంటూ నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తూ మంచి చదువులు చెప్పాలని.. మెనూ పాటించకుంటే ఎలా అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ప్రశ్నించారు.
మంగళవారం నంచర్ల లో ప్రభుత్వ జడ్.పి.పాఠశాల తనిఖీ, తహశీల్దార్ కార్యాలయం లో అధికారులతో త్రాగు నీరు సరఫరా,సాగు,పంటల పై సమీక్ష, నంచర్ల లో ప్రభుత్వ జడ్.పి.ఉన్నత పాఠశాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మధ్యా హ్న భోజనం లో మెనూ ప్రకారం కూరగాయలు, భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.మధ్యాహ్న భోజనం లో మెనూ పాటించక పోవడం తో మధ్యాహ్న బోజన నిర్వాహకులు,ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజనం లో మెనూ ప్రకారం ఆకుకూరలు,కాయ గూరలు, గుడ్డు అందించాలన్నారు. పాఠశాలలో ఎఫ్.ఎల్. ఎన్. ఏ. ఐ .ఆధారిత కంప్యూటర్ సిస్టం,ల్యాబ్ పరిశీలించారు.ఎఫ్.ఎల్. ఎన్. ఏ. ఐ .ఆధారిత కంప్యూటర్ సిస్టం ద్వారా మహమ్మదాబాద్ మండలం లో నంచర్ల,గాధిర్యాల లోని పాఠశాలల్లో రెండు చోట్ల ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వెనుక బడిన విద్యార్థులకు ఎఫ్.ఎల్. ఎన్. ఏ. ఐ ఆధారిత కంప్యూటర్ సిస్టం ద్వారా బోధన చేసి వారి ప్రగతి పరిశీలించాలని అన్నారు. ప్రజల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు అధికారం ఎల్లప్పుడూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తహశీల్దార్ తిరుపతయ్య,ఎం.పి.డి. ఓ నరేందర్ రెడ్డి, నంచర్ల ప్రభుత్వ జడ్.పి. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.