calender_icon.png 29 December, 2024 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యలో రూల్స్ మారిస్తే ఎలా?

07-12-2024 01:17:58 AM

* రిక్రూట్‌మెంట్  నిబంధనలపై సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ, నవంబర్ 7: ఉద్యోగ నియామకాల నిబంధనలు ఇష్టం వచ్చినపుడు మారు స్తామంటే కుదరదని సుప్రీకోర్టు తేల్చిచెప్పింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు అభిప్రాయపడింది.. రిక్రూ ట్‌మెంట్ ప్రక్రియ మొదలుకాకముందే ఒకసారి నియమ నిబంధనలు ఏర్పాటుచే సుకుంటే ఆ తర్వాత వాటిని మార్చడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నియామక ప్రక్రియలోని రూల్స్ ఖచ్చితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ అనుగుణంగా ఉండాలని పేర్కొంది. దీంతో 2008లో కే మంజుశ్రీ వర్సెస్ ఆధ్రప్రదేశ్ కేసులో సుప్రీకోర్టు ఇచ్చిన తీర్పును బెంచ్ సమర్థించినట్లుంది.

ప్రభుత్వాలు నియామక ప్రక్రియకు సంబంధించి ముందే నిబంధనలు సిద్ధం చేసి ఆ తర్వాతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని పేర్కొంది. చివరికి ఖాళీలను పూరించిన తరవాత ఆ ప్రక్రియ ముగుస్తుందని తెలిపింది. నోటిఫికేషన్‌లోనే  అవసరాన్ని బట్టి నిబంధనలు మారుస్తాం అని పేర్కొంటే ఇబ్బంది లేదని అప్పుడు నిబంధనలు మార్చుకోవచ్చని తెలపింది.

రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెల్లదు..

రాజస్థాన్ హైకోర్టులో ఓ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి 13 పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి మధ్యలో నూతన నిబంధన జారీ చేయడంతో ఉద్యోగాలు కోల్పోయిన ముగ్గురు అభ్యర్థులు దాఖలు చేసిన విషయమై కోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది.