calender_icon.png 19 April, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి కూలీ డబ్బులు ఇవ్వకుంటే ఎట్లా?

19-04-2025 01:33:33 AM

మహబూబ్ నగర్ ఏప్రిల్ 18 (విజయ క్రాంతి) : ఏ పని లేకుంటే ఉపాధి పని కల్పించి అవసరమైన డబ్బులను  అందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వము నిర్లక్ష్యం వివరిస్తే ఎంతవరకు సమంజసం అని సిపిఎం నాయకులు కడియాల మోహన్ విమర్శించారు. శుక్రవారం మహబూబ్నగర్ రూరల్ మండల పరిధిలో కోడూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రాంతంలోనే నిరసన వ్యక్తం చేశారు. 

రోజు మూడు నాలుగు కిలోమీటర్ల నడిచి ఉపాధి పనులు చేస్తుంటే ప్రభుత్వం వారికి కూలీ డబ్బులు కూడా మూడు నెలలు గా ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఫీల్ అసిస్టెంట్లకు కూడా గత మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, తదితరులు ఉన్నారు.