calender_icon.png 20 November, 2024 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెడ్మాస్టర్లే విద్యాధికారులైతే ఎలా?

02-08-2024 12:00:00 AM

పలు మండలాలకు రెగ్యులర్ మండల విద్యాధికారులు లేరు. హైస్కూల్స్‌లో వుండే సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకే ‘మండల విద్యాధికారులు’గా అదనపు బాధ్యతలు అప్పచెబుతు న్నారు. పలుచోట్ల నాలుగు మండలాలకు ఒక్కరే ‘మండల విద్యాధికారి’ కొనసాగుతున్నారు. ఒకవైపు పాఠశాల నిర్వహణ, మరోవైపు మండలంలోని వివిధ పాఠశాలల పర్యవేక్షణ వారికి కష్టమవుతున్నది. ‘రెండు పడవలపై ప్రయాణం’ అన్న మాదిరిగా వారి పరిస్థితి మారింది. ఇదే సమయంలో పలు నివేదికలు ప్రభుత్వానికి పంపడంలో కాలయాపన జరుగుతున్నది కూడా. హెడ్మాస్టర్ల విధులు కత్తిమీద సాములా మారాయి. ప్రభుత్వం ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి మండలానికి రెగ్యులర్ మండల విద్యాధికారిని నియమించాలి. అలాగే, రాష్ట్రంలోని చాలా పాఠశాలలో మౌలిక వసతులు కొరత చాలా వుంది. సంవత్సరాలు గడుస్తున్నా అనేక స్కూళ్లలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రారంభమైన పనులైనా పూర్తి కావడం లేదు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడవలసి వస్తున్నది. 

 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్