23-02-2025 12:07:54 AM
ఈ మధ్యకాలంలో బ్రెయిన్ స్ట్రోక్ బారినపడేవారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, ఒంటరితనం, జన్యుపరమైన కార ణాలు, హైబీపీ, మధుమేహం ఇవన్నీ బ్రెయిన్ స్ట్రోక్ బారినపడే ముప్పును పెంచుతున్నాయి. అయితే ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ టొరొంటో సైంటిస్టులు నిర్వహించిన అధ్యయనంలో విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది.
65 ఏళ్ల పైబడిన 13 వేల మంది నుంచి సమాచారాన్ని సేకరించి సైంటిస్టులు ఈ నివేదికను రూపొందించారు. పిల్లల వయసు 18 సంవత్సరాలు దాటక ముందే తల్లిదండ్రులు విడిపోతే ఆ పిల్లలకు భవిష్యత్తులో 60 శాతం మందికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్న పిల్లలతో పోల్చితే.. విడాకులు, ఇతర కారణాలతో తల్లిదండ్రులు విడిపోయిన కుటుంబాల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.