calender_icon.png 3 February, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాది మరిస్తే!

03-02-2025 01:25:07 AM

లైఫ్‌లో జరిగే ప్రతి మూమెంట్ ఎంతో స్పెషల్. గడిచిన ప్రతి క్షణం ఒక జ్ఞాపకంగా మారుతుంది. అందుకే కొత్త ఉదయాన్ని స్వాగతిస్తూ, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడపాలి. నిన్నటి రోజు రేపు గుర్తుండకపోవచ్చు. ఈరోజు కలిగే సంతోషం, బాధ, కోపం ఏదైనా సరే.. ఏదో ఒక రోజు మర్చిపోక తప్పదు. అప్పుడు అవి తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంది. పరిమితి దాటాక జ్ఞాపకాలకు చెక్ పెడుతుంటుంది కాలం.

ఆరుపదులు నిండాక ఏడు దశాబ్దాలకు చేరువయ్యే తరుణంలో అప్పటివరకు చూసిన జీవితం. పదిలపరుచుకున్న జ్ఞాపకాలు.. అన్నీ మసకబారిపోతాయి. కన్నబిడ్డల్ని, వాళ్ల పేర్లని మర్చిపోతారు. అంతెందుకు ఒక్కోసారి వాళ్ల పేరు వాళ్లకే గుర్తుపట్టలేరు. ఎంతో జీవితాన్ని, బిడ్డల ఎదుగుదలను చూసి, మనవళ్లు మనవరాళ్లతో ఆనందంగా గడపాల్సిన టైంలో ఈ పరిస్థితి రావడం బాధకరం.

ఈ స్థితినే అల్జీమర్స్, డిమెన్షియా అంటారు. నిజానికి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టైంలో మతి మరుపు సహజం. కానీ వయసు పైబడిన తర్వాత అదో జబ్బుగా ఇబ్బంది పెట్టడం గురించి ఎక్కువ దృష్టి పెట్టాలి. అసలు మతిమరుపు ని జబ్బుగా అనుకుని వాళ్లు చాలామందే ఉండొచ్చు. ఈ సమస్య బారినపడకుండా ఉండాలంటే లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. 

అలవాట్లు మార్చుకుంటే.. 

అల్జీమర్స్ ఉన్నవాళ్లురోజూ పుస్తకం చదవాలి. పాటలు వినాలి. డాన్స్ చేయాలి. షటిల్ వంటి ఆటలు ఆడటం వల్ల మతిమరుపు కొంచెం తగ్గుతుంది. రోజూ ఎక్సర్‌సైట్ చేయాలి. అల్జీమర్స్ పేషంట్ల మీద కోప్పడటం, అరవడం వంటివి చేయొద్దు. వాళ్లను ఆందోళన, ఒత్తిడికిలోనుకాకుండా చూసుకోవాలి. యాక్టివ్‌గా ఉండేందుకు పండ్లు, నట్స్, చేపలు, అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తినిపించాలి. ఇవన్నీ చేస్తే మతిమరుపును దూరం చేయొచ్చు. 

మతిమరుపు లక్షణాలు

* మతిమరుపు ఉన్నవాళ్లలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అంటే జరిగిన విషయాలు గుర్తుపెట్టుకునే సామర్థ్యం కోల్పోతారు. 

* ప్రతిదానికి టెన్షన్ పడతారు. మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. టైంకి సరైన పదాలు గుర్తుకురాక, ఆలోచిస్తుంటారు.

* సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఉండదు. లాజికల్ థింకింగ్, ప్లానింగ్, ఆర్గనైజింగ్ వంటివి సరిగ్గా చేయలేరు.

* గందరగోళంగా ఫీల్ అవుతుంటారు.