- అమెరికా అధ్యక్షుడిని ఎలా నిర్ణయిస్తారు?
- కంటింజెంట్ ఎన్నికలో ఏం జరుగుతుంది?
వాషింగ్టన్, నవంబర్ 5: అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు సంక్లిష్టంగా ఉంటాయి. ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోరు. రాష్ట్రాల్లోని ప్రతినిధులను ఎన్నుకుంటారు. అయితే, అధ్యక్షుడి కేంద్రంగానే ఓటర్లు ఎలక్టర్లకు మద్దతిస్తారు.
రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా వాటి ఎలక్టోరల్ కాలేజీలుగా విభజిస్తారు. మొత్తం 50 రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. వీటిలో 270 ఆపైన ఓట్లు సాధించిన అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఇప్పటికే పోలింగ్ ప్రారంభం కాగా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలహ్యారిస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.
ఈ క్రమంలో ఎవరికీ మెజారిటీ వస్తుంది? ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక వేళ ఇద్దరికీ కావాల్సిన మెజారిటీ రాకపోతే దాన్ని ‘టై’గా పరిగణిస్తారు. ఈ సమయంలో విజేతను నిర్ణయించేందుకు అమెరికాలో పలు విధానాలను సిద్ధం చేశారు కంటింజెంట్ ఎన్నిక జరిగితే అనూహ్య ఫలితాలు కూడా రావచ్చు.
కాంగ్రెస్‌దే బాధ్యత
అమెరికా కాంగ్రెస్‌లో ౫౦ రాష్ట్రాలకు గాను ఒక్కోదానికి ఇద్దరు చొప్పున ౧౦౦ మంది సెనేటర్లు ఉంటారు. ఇక మొత్తం రాష్ట్రాలకు ౪౩౫ మంది ప్రతినిధులు ఉంటారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ ఉన్న డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియాకు ౩ స్థానాలను కేటాయించారు. ఇవన్నీ కలిపి ౫౩౮ ఓట్లు అవుతాయి.
ఇద్దరు అభ్యర్థుల్లో 270 ఎలక్టోరల్ ఓట్లు ఎవరికీ రాని పక్షంలో ఎవరిని విజేతగా ప్రకటిస్తారనే అంశం ఆసక్తిగా మారింది. చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదే జరిగితే అధ్యక్షుడిని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్‌పై పడుతుంది. దిగువ సభగా పిలిచే ప్రతినిధుల సభ ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటుంది.
ఇందుకోసం జనవరి 6న కాంగ్రెస్ సమావేశమవు తుంది. ఒక్కో రాష్ట్రానికి ఒక ఓటు చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26, ఆపైన ఓట్లు సాధించినవారే అధ్యక్షుడు అవుతారు. అమెరికాలో చివరిసారిగా రెండు శతాబ్దాల కింద 1,800 సంవత్సరంలో హంగ్ ఏర్పడింది.
థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో ప్రతినిధుల సభ ఓటింగ్‌లో జెఫర్సన్ గెలిచారు. కాగా, ఉపాధ్యక్ష రేసులో హంగ్ ఏర్పడితే ఎగువ సభ సెనేట్‌లో ఓటింగ్ నిర్వహిస్తారు.
స్పీకర్‌కూ అధ్యక్షుడయ్యే అవకాశం
ప్రెసిడెంట్ కోసం జరిగే కంటింజెంట్ ఎన్నికలో ఎవరికీ ౨౬ ఏట్లు రాకపోయినా మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. జనవరి ౨౦ నాటికి కొత్తగా ఎన్నికైన ఉపాధ్యక్షుడే తాత్కాలిక ప్రెసిడెంట్‌గా బాధ్యత చేపడుతారు. కానీ, జనవరి ౨౦ నాటికీ సెనేటర్లు కూడా ఈ ఉపాధ్యక్షుడిని ఎన్నుకోకపోతే అమెరికా రాజ్యాంగంలోని ౨౦వ సవరణ తాత్కాలికంగా అమల్లోకి వస్తుంది.
అప్పుడు నూతనంగా ఎన్నికైన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్వీకర్‌కు అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం లభిస్తుంది. అయితే అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు.