calender_icon.png 21 January, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చిన ఫిర్యాదులే వస్తే ఎలా?

21-01-2025 12:57:11 AM

మహబూబ్ నగర్, జనవరి 20 (విజయక్రాంతి) : వచ్చిన ఫిర్యాదులే తిరిగి పునరావత్తం అయితే ఎలా అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ప్రశ్నించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దాదాపుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రతి సమస్య అధికారులకు తెలిసి ఉంటుందని గ్రామీణ, మండల స్థాయిలోని అధికారులు ఆ సమస్యలు వారి దష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు సహాయ శయశక్తులుగా కషి చేయాలి అన్నారు. పరిష్కారం కానీ ఎడల వారికి సవిధానంగా వివరించి అర్థవంతమైన సూచించాలని పేర్కొన్నారు.

అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తే ప్రజలు వారు సమస్యలతో నిరంతరం తిరుగుతారని, దీంతో అధికారులపై ప్రజలకు విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. తమ పరిధిలోని ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ బాధ్యతగా ముందుకు సాగాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ ప్రజావాణి కి 85 ఫిర్యాదులు అందాయి. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర  ప్రతాప్,రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.