బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు అం టూ గొప్పలు చెప్పుకుంటుదని కా ర్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11 నెలల కాం గ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందే మీ లేదన్నారు.
విద్యార్థులకు హాస్టల్స్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పేర్కొన్నారన్నారు. పాలనను గాలికి వదిలి, గురుకుల హాస్టల్స్లో 36 మంది విద్యార్థుల చావుకు కారణమైనందుకు విజయోత్సవాలు జరుపు తున్నారా అని నిలదీశారు.