calender_icon.png 22 February, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలి

16-02-2025 12:20:08 AM

రాహుల్‌గాంధీది బడుగు, బలహీన కులం: వీహెచ్  

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): దేశానికి కాంగ్రె స్ ఏం చేసిందని అంటున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి..  పదేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చారా? అని నిలదీశారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ భూ సంస్కరణలు చేసి పేదలకు భూములు పంచిందని, ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు పంచడంతోపాటు సొంత ఇంటి నిర్మానం చేపట్టిందని గుర్తుచేశారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉండగా ఐఐటీ, ఐఐఎంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేసిందని చెప్పారు. రాహుల్‌గాంధీది బలహీన వర్గాల కులమని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కులగణన చేస్తా రా? లేదా? చెప్పాలని డి మాండ్ చేశారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరినా మోదీ పట్టించుకోలేదన్నారు.