మున్సిపాలిటీపై జెండా ఎగురవేయాలని ఇరు పార్టీల తహ తహ!
ఒకే పార్టీలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరేనా?
వనపర్తి, జనవరి 6 (విజయక్రాంతి): మరో 9 రోజుల్లో మున్సిపాలిటీ పాలక వర్గం పదవి కాలం ముగియనుండడంతో వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార, ప్రతి పక్ష పార్టీలు దృష్టి పెట్టాయి. గత ఏడాది క్రితం సర్పంచ్‌ల పదవి కాలం ముగియడం తో గ్రామాల్లో ప్రత్యేక పాలనను ప్రభుత్వం కొనసాగిస్తుంది. దీంతో పాటు మండలం వ్యవస్థ ఎంపిటిసి, జెడ్పిటిసి పదవి కాలం ముగిసినప్పటికీ ఎన్నికలను నిర్వహించ డంలో ప్రభుత్వం వెనుక అడుగు వేస్తుంది.
దీంతో పాటు మరో 9 రోజుల్లో మున్సిపా లిటీ పాలకవర్గం పదవి కాలం ముగియ నున్న నేపథ్యంలో మున్సిపాలిటీలో సైతం ప్రత్యేక పాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేయనుంది. ఈ నేపథ్యంలో ఒక పక్కన సం క్రాతి పండుగకు ఇందిరమ్మ రైతు భరోసా పేరుతో రైతులకు పెట్టుబడి సహాయం, నిరు పేదలకు నూతన రేషన్ కార్డు ల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను సైతం వేగవంతం చేస్తూ వాటిని ప్రజలోకి తీసు కుని వెళ్లి అనుకూలత పెంచుకోవాలన్న ల క్ష్యంతో గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది.
కానీ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే స్థాయిలో వర్గ పోరు నడుస్తుంది. వనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే మే ఘారెడ్డి రాకను శాసనసభ ఎన్నికల ముందు నుండి వ్యతిరేకించిన ప్రస్తుత రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి వర్గం, గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారాని వ్యతిరేకి స్తున్న మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత వర్గం ల మధ్య త్రీవ స్థాయిలో వర్గ పోరు నడు స్తుంది.
దీంతో పాటు అలంపూర్ నియోజ కవర్గంలో ఎంఎల్‌సి చల్లా వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యే విజేయుడు రాకను ఏఐసిసి కార్య దర్శి సంపత్ కుమార్ సైతం వారి రాకను వ్యతిరేకించగా ప్రస్తుతం వారు బిఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్న పరిస్థితి. కానీ రెండు వర్గాలలో మాత్రం పార్టీలో పరో క్షంగా కలిసి నట్లుగానే చర్చ నడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గ పోరును నిలువరించేందుకు పార్టీ తీసుకునే నిర్ణయాల పైనే ఆసక్తి నెలకొంది.
రిజర్వేషన్ మారితే.....
గత ప్రభుత్వ హయాంలో చిన్న జిల్లాల ఏర్పాటు చేయడంతో మేజర్ గ్రామ పంచా యతీలను విలీన గ్రామాలను మున్సిపాలి టీలుగా మార్చగా ఒక పర్యాయం మున్సిపా లిటీ ఎన్నికలు సైతం జరిగాయి. రాష్ర్టంలో కులగణన కార్యక్రమం సైతం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. దీంతో మున్సిపాలిటీ పరిధిలో ఆయా వార్డులో కు ల గణన ప్రకారంగా రిజర్వేషన్లు సైతం మారె అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు మారితే ప్రస్తుత ఉన్న వార్డులు కాకుండా ఇతర వార్డుల నుండి ఫోటి చేయాలా ఒక వేళ ఫోటి చేసిన గెలుపు దక్కుతుందా లేక మహిళల రిజర్వేషన్ అయితే తమ కుటుం బంలోని మహిళలను ఫోటీలో నిలబెట్టాలా అనే సమాధానాలు లేని పలు ప్రశ్నలుగా నాయకుల ఊహలో మెదులుతున్నాయి.
జెండా ఎగురవేయాలని తహ తహ
జిల్లాలో తమ పార్టీలు బలంగా ఉండా లంటే మున్సిపాలిటీలు కీలక పాత్రను పోషి స్థాయి. స్థానిక సంస్థలో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు, పాలన పట్ల ప్రజలు అందరు హస్తం వైపు ఉన్నారని కాంగ్రెస్ నాయకులు ధీమాను వ్యక్తం చేస్తు న్నప్పటికి సంవత్సర కాలం నుండి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని ప్రజలంతా తిరిగి బిఆర్‌ఎస్ వైపు చూస్తు న్నారని స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగురవేస్తామని కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అగ్ర నాయకులు ధీమాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబందించి మున్సిపాలిటీ పాలక వర్గం ముంగిపు కాకముందే గ్రౌండ్ స్థాయి లో తమ తమ ఎత్తుగడలో బిజీగా ఉన్నారు
పెరుగుతున్న ఆశవాహులు
గడిచిన 10 ఏండ్ల తరువాత తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు అయిన బి ఆర్ ఎస్, బిజెపి పార్టీల నుండి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో పాటు వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో అప్పటికే ఉన్న బి ఆర్‌ఎస్ పార్టీలకు చెందిన చైర్మన్, వైస్ చైర్మ న్‌ల అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ పై జెండాను ఎగురవేసింది.
గతంలో జరిగిన మున్సిపా లిటీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ చేతిలో ఓడిపోయి నాయకులుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండగా ప్రభుత్వం మారిన వెంటనే చాలా మంది కౌన్సిలర్లు బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రె స్ లోకి చేరారు ఇప్పటి వరకు బాగానే ఉన్న అసలు సమస్య ప్రారంభం అయింది.
గతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఎదుగు తున్న నాయ కులు, బిఆర్‌ఎస్ నుండి వచ్చిన కౌన్సిలర్లు నాయకులు పెరగడంతో తమకే టికెట్ వస్తుందని ఇప్పటికే ఆయా వార్డులో చెప్పు కుంటూ చావులు, అనారోగ్యాలు పాలు అయిన వారిని పరామర్శలు సైతం చేస్తు ఉన్నంతలో ఆర్థిక సహాయాలు చేస్తూ మరొ క వైపు యువత తమ వైపు ఉండేలా ఇప్పటి నుండే వారిని మచ్చిక చేసుకుంటున్నారు . దీంతో ప్రతిపక్ష పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య మరింత పెరుగుతోంది.