calender_icon.png 26 December, 2024 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసుపుబోర్డు ఏమైంది

25-12-2024 12:27:12 AM

ఎంపీని ప్రశ్నించిన అన్వేశ్‌రెడ్డి

నిజామాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): పసుపుబోర్డు ఏర్పాటుకు లిఖిత పూర్వక హమీ ఇచ్చి ఎందుకు తీసుకురాలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట్ అన్వేశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఇన్నాళ్లు పసుపుబోర్డు విషయం ఎందుకు మభ్యపెడుతున్నారని నిలదీశారు.

మంగళ వారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్వేశ్‌రెడ్డి మాట్లాడారు. పసుపుబోర్డు ప్రకటన కేవలం క్షీరాభిషేకానికే పరిమితమైందని విమర్శించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఏఎంసీ చైర్మన్ సాయిబాబాగౌడ్, వైస్ చైర్మన్ జీవన్, నాయకులు పాల్గొన్నారు.