- సోనియా గాంధీ పుట్టినరోజే అమలు చేస్తామన్నారు
- సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ డీకే అరుణ ఫైర్
హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): సోనియా గాంధీ పుట్టిన రోజునాడే హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఏడాది కావొస్తున్నా ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంతవరకూ- ఒక్క ఇల్లు కూడా మొదలుపెట్టలేదన్నారు.
కేంద్రం నిధులు లేకుండా రాష్ట్ర ప్రభు త్వం ఇళ్లు కట్టగలదా? అని ప్రశ్నించారు.- సగం మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని విమర్శించారు. కర్ణాటకలో డీకే శివకుమార్ ఉచిత బస్ పథకాన్ని ఎత్తేస్తామంటున్నారని ఆరోపించారు. ఫ్రీ బస్ అని చెబుతూనే గ్రామాల్లో బస్సులను బంద్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.- ప్రధాని మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలను మాత్రమే ఎత్తి చూపారని పేర్కొన్నారు.
గ్యాస్ సిలిండర్‌కు సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వమే రూ.375 చెల్లిస్తుందన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఎంత చెల్లిస్తుందో చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారని మండిపడ్డారు.- రైతు భరోసాతోపాటు కౌలు రైతులు, కూలీలకు సాయాన్ని ఇంతవరకూ అందించలేదన్నారు. కాలేజీ చదివే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్న హామీ ఎటుపోయిందని ఎద్దేవా చేశారు.-
11 నెలల్లో 50 వేల ఉద్యోగాల భర్తీ మాట పెద్ద బోగస్ అన్నారు.- ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల విలువైన వైద్యం గడిచిన ౧౧ నెలల్లో ఎంత మందికి, ఎక్కడెక్కడ చేయించారో వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం రేవంవత్ రెడ్డి దబాయిస్తున్నారని ఆరోపించారు. ఫించనుల విషయంలో కూడా ప్రభుత్వం మోసం చేసిందని దయ్యబట్టారు.