- కాంగ్రెస్‌పై మండిపడ్డ మాజీ మంత్రి రామన్న
ఆదిలాబాద్, జూలై 2(విజయక్రాంతి): ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుతం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమయిందన్నారు.
పెనన్లు సకాలంలో అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రైతు భరోసా అందకపోవడంతో అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్‌రెడ్డి ఇప్పటికీ ఒక్క జాబ్ నోటిఫికేషన్ సైతం విడుదల చేయలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఫొటో ఉన్నదన్న కారణంతో పాఠ్యపుస్తకాల పంపిణీని నిలిపివేయడం తగదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రాళ్ల భూములకు రైతుబంధు ఇచ్చారన్న ఆరోపణలపై క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మంత్రి తుమ్మల నాగేశరరావు వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు.