11-04-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 10(విజయ క్రాంతి):పేదింటి ఆడబిడ్డ పెళ్లికి నగదు తో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మోసం చేసిందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు.గురువారం జైనూర్,సిర్పూర్ యు.లింగాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాధ్ తో కలిసి పంపిణి చేశారు.
ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిందని వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.కెసిఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు.కార్యక్రమంలో ఆయా మండలాల తహశీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.