09-02-2025 01:04:20 AM
* ఆనాడు నిర్వాసితుల పక్షాన మీరు చేసింది రాజకీయమేనా!
* సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాం తి): మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితుల కు అండగా ఉంటానని ప్రతిపక్షంలో ఉన్న ప్పుడు మీరు ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నిరాహారదీక్ష చేశారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున ఆ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డిపై ఉందని మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, పునరావాస కాలనీల నిర్మాణం, ఇంటి స్థలాలు, సౌకర్యాల కల్ప న పూర్తయిందని, మిగిలిన 10 శాతం సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారని, పెండింగ్ సమస్యల పరిష్కారంతోపాటు మరింత మెరుగైన సౌకర్యాలు, పరిహారాన్ని అందిస్తారని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ నిర్మాణ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 2013 భూసేకరణ చట్టంతో నిర్వాసితులకు 121 గజాల ఇంటి స్థలం, ఒక లక్షా 25 వేలు మాత్రమే అందించాలనే నిబంధన ఉందని, కానీ దేశ చరి త్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా మెరుగైన ప్యాకేజీని మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అమలు చేశారని చెప్పారు.
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ప్రతీ నిర్వాసితుడికి గజ్వేల్ సమీపంలోనే 250 గజాల ఇంటిస్థలం, ఇంటి నిర్మాణానికి 5.04 లక్షల రూపాయలు, రూ.7.50 లక్షల పరిహారం అందజేశామన్నారు. అక్కడక్కడ ప్యాకేజీ మిస్సయినవారికి పరిహారం అందించాల్సి ఉందని, ప్రభుత్వం మారి క్రమంలో ఆ మిగతా పనులను పూర్తి చేయలేకపోయామని, ముంపు గ్రామాలకు చెందిన వితం తువులను కూడా కుటుంబంగా పరిగణించి వెంటనే పరిహారం అందించాలని కోరారు.