- అదానీతో రేవంత్ ఏం ముచ్చట్లు పెట్టారో చెప్పాలి
- బీఆర్‌ఎస్ నేత దాసోజ్ శ్రవణ్
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): స్కిల్ యూనివర్సిటీ కోసం అదానీ ఇచ్చిన కొసరు వందకోట్లను సీఎం రేవంత్‌రెడ్డి తిరిగి ఇస్తున్నాడని, కానీ కోహినూర్ హో టల్‌లో నాలుగు గంటల పాటు ముచ్చట్లు పెట్టి పంచుకున్న సంగతి బయటపెట్టాలని బీఆర్‌ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ డిమాండ్ చేశారు.
సోమవారం ఎక్స్ వేదికగా స్పంది స్తూ రూ. 12,400 కోట్లు ఒప్పందా ల గూడుపుఠాణీ ఏమిటో కూడా ప్రజలకు చెప్పాలన్నారు. కెన్యాలాం టి చిన్న దేశం సైతం సామాజిక బాధ్యతతో వెంటనే అదానీతో ఒప్పందాలు రద్దు చేసిందని తెలిపారు. రాహుల్ గాంధీ మొట్టికాయలు వేసే దాకా రేవంత్‌రెడ్డికి అదానీని వదిలే బుద్ది రావడం లేదని అంటూ మండిపడ్డారు.