calender_icon.png 10 January, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల పింఛన్లు ఏమయ్యాయి?

04-12-2024 02:15:55 AM

బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్3 (విజయక్రాంతి): హామీ ఇచ్చినట్లుగా దివ్యాంగులకు రూ. 6వేల పింఛన్ ఎందుకు అందించడంలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌శ్‌రెడ్డి ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన మోసగాడి ప్రభుత్వం దివ్యాంగులను కూడా మోసం చేసిందని విమర్శించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, ప్రత్యేక కోటా ఇండ్లు, లోన్లు ఇవ్వనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్, రూ. 80వేల కోట్ల అప్పు తెచ్చినా  దివ్యాంగులను ఆదుకునాలనే సోయి లేదన్నారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.