calender_icon.png 7 November, 2024 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీనామాకు ముందు ఏం జరిగింది?

07-08-2024 02:37:57 AM

ఆదివారం ఘర్షణల నేపథ్యంలో సోమవారం పోలీసులు, భద్రతా సిబ్బందితో ప్రధాని నివాసం గణభాబన్‌లో హసీనా భేటీ అయ్యారు. కర్ఫ్యూను మరింత కఠినంగా అమలు చేయాలని, నిరసనలను అణచివేయాలని హసీనా కోరినట్లు తెలుస్తోంది. అయితే భద్రతా దళాల అధిపతులు మాట్లాడుతూ.. ఆందోళనలను అదుపు చేసే పరిస్థితి లేదని వివరించారు.

అంతేకాకుండా గణభాబన్‌ను నిరసనకారులు ముట్టడించే అవకాశముందనే నిఘా వర్గాల సమాచారాన్ని ఆమెకు తెలియజేశారు. 45 నిమిషాల్లో నిరసనకారులు ముట్టడించే అవకాశం ఉందని, ఆ లోపు రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాలని చెప్పారు. అందుకు హసీనా అంగీకరించలేదు. దీంతో ఆమె సలహాదారులు, సోదరి రెహానా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

అయినా ఫలితం లేకపోవడంతో హసీనా కుమారుడు సాజీద్ వాజెద్ జాయ్.. హసీనాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పరిస్థితుల గురించి పూర్తిగా వివరించి, వ్యక్తిగత భద్రత దృష్ట్యా దేశం విడిచి వెళ్లాలని సూచించగా చివరికి ఆమె ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దేశం విడిచి వెళ్లేముందు జాతినుద్దేశించి ప్రసంగించాలని హసీనా భావించారు. కానీ, సమ యం లేని కారణంగా అది కుదరలేదు. సోమవారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు మిలిటరీ హెలికాప్టర్‌లో భారత్‌కు బయలుదేరారు.