calender_icon.png 19 January, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒలింపిక్ విలేజ్ ఏం చేస్తారు?

11-08-2024 01:29:26 AM

పారిస్: ఒలింపిక్ క్రీడలకు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. చాలా రోజుల నుంచి ఒలింపిక్స్ పోటీలు జరుగుతున్నాయి. మొదటి ఒలింపిక్స్ 776 బీసీలో జరిగాయట. ఇక మోడ్రన్ ఒలింపిక్స్ మాత్రం 1896 నుంచి జరుగుతున్నాయి. మొదట్లో ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల కోసం ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కావు. అథ్లెట్లు దగ్గరలోని హోట ల్స్, సత్రాలు, స్కూల్స్ ఇలా ఎక్కడో ఓ చోట బస చేసేవారు. వారు తిండికి కూడా చాలా ఇబ్బందులు పడేవారు. కానీ 1924వ సంవత్సరంలో పారిస్ నగరంలోనే ఒలింపిక్స్ జరిగాయి. అప్పుడు ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా ఒలింపిక్ విలేజ్ నిర్మించారు.

అప్పటినుంచి ఆ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఈ క్రీడా గ్రామాల్లో అథ్లెట్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. అథ్లె ట్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎంచక్కా గేమ్ మీద దృష్టి సారించేందుకు వీలుంటుంది. ఒలింపిక్స్ అనేవి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని అందరికీ తెలిసిందే. ఒలింపిక్స్ నిర్వహించే దేశం క్రీడల్లో పాల్గొనే అథ్లెట్ల కోసం అధునాతన సౌకర్యాలతో కూడిన క్రీడా గ్రామాలను నిర్మించడం ఆనవాయితీగా వస్తోంది.

ఒలింపిక్ క్రీడలు ముగిసిన తర్వాత ఈ క్రీడా గ్రామాలను ఏం చేస్తారని అనేక మందిలో సందేహం ఉంటుంది. ఒలింపిక్ గేమ్స్ ముగిసిన తర్వాత ఆ విలేజ్‌ను ఏం చేస్తారనేది ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు. కొన్ని సందర్భాల్లో ఈ క్రీడా గ్రామాలను తొలగించారు. మరికొన్ని సార్లు మాత్రం అందమైన భవనాలుగా మార్చి వేరే అవసరాలకు ఉపయోగించుకున్నారు. కొన్నేళ్లుగా మాత్రం ఒలింపిక్ కమిటీ .. తాము నిర్మించిన విలేజ్‌ను కాలేజీలు, స్కూళ్లుగా మారుస్తు వస్తోంది.