calender_icon.png 10 January, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోర్త్ సిటీలో మెట్రో కారిడార్ ఇలా..?

07-01-2025 12:25:47 AM

సువిశాలమైన గ్రీన్ ఫీల్ రోడ్డు.. మధ్యలో మెట్రో

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా చేపట్టబోయే ఫోర్త్ సిటీలో మెట్రో కారిడార్ నగరంలోని ఎలివేటెడ్ కారిడార్ల కంటే భిన్నంగా ఉండబోతోందని తెలుసున్నది. 300 ఫీట్ల సువిశాలమైన గ్రీన్ ఫీల్ రోడ్డు మధ్యలో మెట్రో కారిడార్ ఉండనుంది. రావిల్యాల్ ఎగ్జిట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు ఈ కారిడార్ దాదాపు 18 కిలో మీటర్ల మేర ఉండే అవకాశం ఉందని మెట్రో అధికారులు గతంలో వెల్లడించారు. ఆ కారిడార్ ఊహా చిత్రాన్ని మెట్రో అధికారులు ఇలా రూపొందించినట్టు తెలుస్తోంది.