calender_icon.png 15 January, 2025 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాన్నంటే ...

23-12-2024 12:00:00 AM

నీవు కన్న కలల కోసం

తను కలలు కన్న ప్రపంచాన్ని మరిచిపోయేవాడు 

నీవు ఎక్కే మెట్లకోసం

తను ఎక్కాల్సిన మెట్లను కూడా దిగిపోయేవాడు

నీ కళ్ళలో ఆనందం కోసం

తను ఎన్ని అవమానాలు అయినా భరించేవాడు

నీవు వర్షపు చినుకుల్లో తడిస్తే జలుబు చేస్తుందని

తను తడుస్తూ నీకు గొడుగు పట్టేవాడు

నీ కోసం తన శక్తినంతా ధారపోస్తాడు

కానీ, నీ ఒంట్లోంచి ఒక్కబొట్టు రక్తం కారినా తట్టుకోలేనివాడు!

-చిత్రాడ కిషోర్ కుమార్