తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వే ఎవరికి, ఎంతవరకూ ఉపయోగపడుతుందో చూడాలి. ఈ సర్వేలో అనేక అనవసర ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా నగరంలో నివసించే వారికి ఇవి వర్తించవు. ఈ సర్వే ముఖ్యోద్దేశం కులగణననా లేక వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ కోసమా? కేవలం రిజర్వేషన్ కోసమే అయితే అగ్రవర్ణాల సామాజిక వర్గాలకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మేధావులతో చర్చలు జరిపి కులగణన చేస్తామన్నారు. కానీ, అది జరగలేదు. ఆర్థిక పరమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సర్వేలో ఐచ్ఛికత (ఇష్టం లేని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వదిలేసే)కు అవకాశం ఇవ్వాలి.
శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్