calender_icon.png 7 November, 2024 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ కులంతో బీజేపీకి ఏం సంబంధం?

07-11-2024 02:11:07 AM

  1. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలి 
  2. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఫైర్
  3. ప్రజలతో ముఖాముఖి మంచి కార్యక్రమం 

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి):  ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కులంతో బీజేపీకి ఏం సంబంధమని మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. రాహుల్‌గాంధీ కులమేంటో తెలుసుకోవాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని బీజేపీకి సవాల్ విసారారు.

అప్పుడు ఆయన ఇంటికి వెళ్లితే రాహుల్ కుటమేంటో చెబుతారని బీజేపీ నేతలకు మంత్రి సురేఖ సూచించారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ దేశంలో కుల వివక్షతను పొగొట్టడానికి కుల గణన చేయాలని రాహుల్‌గాంధీ  నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేస్తున్నట్లు చెప్పారు. ఎవరి జనాభా ఎంతో.. దేశ సంపదలో వారికి వాటా ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమన్నారు.   కులగణనతో దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలబడుతుందన్నారు.  సంక్షేమం, అభివృద్దిని రెండింటిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లుతోందని తెలిపారు.  

130 దరఖాస్తులు..

బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 130 మంది వరకు తమ సమస్యలను పరిష్కరించాలని సురేఖకు వినతులు అంద జేశారు.

6 గ్యారెంటీల సంబంధించినవి 30 దరఖాస్తులు, వివిధ  శాఖలకు చెందినవి 63, ఇతర దరఖాస్తులు 37 వరకు ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ప్రజల నుంచి   దరఖాస్తులను మంత్రి  సురేఖ తీసుకుని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మంత్రి సురేఖకు వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు.

పెన్షన్లు, అటవీ భూముల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భూ సమస్యలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందరర్భంగా సురేఖ మాట్లాడుతూ  కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్లాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ చెప్పారని, ఇది ఒక మంచి సంప్రదాయన్నారు. ఇది నిరంతరం కొనసాగాలని మంత్రి పేర్కొన్నారు.