calender_icon.png 23 October, 2024 | 1:51 PM

కొత్త చట్టాలపై మీ వైఖరేంటి?

23-07-2024 12:48:53 AM

  1. అవి ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉన్నాయి
  2. నియంతృత్వపూరిత సెక్షన్లను వ్యతిరేకించాలి
  3. రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ 

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయచట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సోమవారం బహిరంగ లేఖలో పేర్కొంటూ వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయచట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, ఈ చట్టంలోని పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ పోరాటాల గడ్డ ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడే స్వభావమున్న నేల అని, ప్రజాస్వామ్య హక్కుల కోసం ఉక్కు పిడికిళ్లు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయన్నారు. అలాంటి తెలంగాణలో ఇటీవల కేంద్రం తెచ్చిన చట్టాలతో అలజడి రేగుతోందని రాష్ట్రప్రభుత్వం స్పందించాలని కోరారు.