calender_icon.png 29 January, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ గురించి నీకేం తెలుసు?

27-01-2025 12:48:31 AM

  • ఉనికి కోసమే బండి సంజయ్ వ్యాఖ్యలు
  • క్షమాపణ చెప్పి వివాదానికి తెరదించాలి
  • పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం 

హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): “దేశంలోని ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తుంది.. ఏ ముసలి అవ్వ, తాతను అడిగినా ఇందిరమ్మ ఇళ్లలోనే ఉంటున్నాం అని చెబుతారు.. ఇందిరమ్మపై విమర్శలు చేసే ముందు కేంద్రమంత్రి బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి..” అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హితువు పలికారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు..

ఇందిరాగాంధీని విమర్శించడం బండి సంజయ్ వయస్సుకు తగదని, వెంటనే క్షమాపణ చెప్పి ఈ వివాదానికి స్వస్తి పలకాలన్నారు. బండి సంజయ్ ఉనికి కోసమే రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు ఇందిరమ్మ పేరుపెడితే కేంద్రం నుంచి నిధులు ఇవ్వమని  సంజయ్ మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శమన్నారు.

ఇందిరాగాంధీ అంటేనే జేజమ్మ అని, రాజకీయాలు పక్కన పెడితే ఆమెకు మునిమనవళ్లమనే విషయం మర్చిపోవద్దని జగ్గారెడ్డి సూచించారు. తాను చిన్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్లే వాడినని, కానీ తమ అమ్మ, నాన్న కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మకు అభిమానులని తెలిపారు. మోడీ, అమిత్‌షా కుటుంబ సభ్యులు కూడా ఇందిరమ్మకు అభిమానులు అయ్యి ఉండొచ్చని పేర్కొన్నారు.