calender_icon.png 24 December, 2024 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతలకు సనాతనంతో ఏం పని?

19-10-2024 02:48:26 AM

  1. సనాతన బోర్డు ఏర్పాటు బాధ్యత ధర్మాచార్యులదే
  2. పవన్‌కల్యాణ్ ప్రకటనపై శంకరాచార్య స్వామీజీ విమర్శలు
  3. జైపూర్‌లో గోధ్వజ్ స్వాపన చేసిన జ్మోతిర్మఠ్ పీఠాధిపతి

జైపూర్, అక్టోబర్ 18: సనాతన బోర్డులను ఏర్పాటు చేసే బాధ్యత ధర్మాచార్యుల దేనని జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి పేర్కొన్నారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యానించారు.

శుక్రవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో గోధ్వజ్ స్థాపన చేసిన అనంతరం భక్తులనుద్దేశించి మాట్లాడుతూ.. సనాతన బోర్డు ఏర్పాటు చేయడం మంచిదే. కానీ ముందు అందులో బోర్డు అనే ఆంగ్ల శబ్దాన్ని తొలగించండి. ఒకవేళ సనాతన సంస్థల్ని ఏర్పాటు చేయాల్సి వస్తే అది ధర్మాచార్యులు చేస్తారు.

పవన్‌కల్యాణ్ సనాతన బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. రాజకీయ నేతగా ఆ పని మీరు ఎలా చేస్తారు? మీరు ఉపముఖ్యమంత్రి. పాలనా కార్యక్రమాలు మీరు చూసుకోండి. సనాతన సంస్థలను కాపాడే బాధ్యత శంకరాచార్యులు, రామానుజచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కాచార్యు లు చూసుకుంటారు అని అన్నారు.