బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో ప్రజలకు ఏమి చేసిందని విజయోత్సవాలు జరుపుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ప్రశ్నించారు.
ఏడాది పాలన విజయోత్సవాలు కాదు.. ఏడాదిలో చెప్పిన అబద్ధాల విజయోత్సవాలు జరుపుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు రూ.వేలకోట్లు నష్టపోతున్నారని విమర్శించారు. రైతు కూలీలకు రూ.12వేలు రాలేదని, రైతు బీమా, పది పంటలకు బోనస్ వంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.