calender_icon.png 17 January, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రిగా ఉండి ఏం చేశావు?

17-01-2025 12:55:44 AM

 మల్లారెడ్డిని నిలదీసిన ఉద్యమకారుడు 

మేడ్చల్, జనవరి 16(విజయ క్రాంతి): ఐదేళ్లు మంత్రిగా, అంతకుముందు అధికార పార్టీ ఎంపీగా పనిచేసి మేడ్చల్ ఆస్పత్రి అభివృద్ధికి ఏం చేశావని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని ఉద్యమకారుడు, బిజెపి నేత పాతూరి సుధాకర్ రెడ్డి నిలదీశారు. గురువారం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభానికి ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి మల్లారెడ్డి వచ్చారు. అక్కడే ఉన్న సుధాకర్ రెడ్డి ఆస్పత్రి అభివృద్ధికి మల్లారెడ్డి ఎలాంటి కృషి చేయలేదన్నారు.

మంత్రిగా ఉన్నందున అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండేదని, కానీ పట్టించుకో లేదన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న మేడ్చల్ లో 100 పడకల ఆసుపత్రి ఉంటే రోగులకు ఎంతో సౌకర్యంగా ఉండేది అన్నారు. పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రి వరకు వెళ్లవలసి వస్తుందన్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, బిఆర్‌ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది.