06-03-2025 12:00:00 AM
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహ ణకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకో ర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ విచారణ పూర్తయి నివేదిక సమర్పించిందా? ఒకవేళ నివేదిక అందినట్లయితే దానిపై తీసుకున్న చర్యలేమిటో చెప్పాలంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
2019 నుంచి రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిం చకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది భాస్కర్ దాఖలు చేసిన పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు పూర్తి కాపీతోపాటు ప్రత్యేక కమిషన్ ఏదైనా నివేదిక సమర్పించిందా, ఒకవేళ ఏదైనా సమర్పించినట్లయితే తీసుకున్న చర్యల వివరాలను తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.