calender_icon.png 4 January, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్డియాక్ అరెస్ట్‌కు కారణమిదే

26-12-2024 12:00:00 AM

జిమ్ చేస్తూనో.. వేగంగా పరుగెడుతూనో కొంతమంది కుప్పకూలి పోతుంటారు. అయితే చాలామంది గుండెపోటుగా భావించి ఆస్పత్రికి తరలిస్తూ ఉంటారు. అయితే గుండెలో తలెత్తే కొన్ని ఇబ్బందులకు తక్షణ చికిత్స అవసరమవుతుంది. అలాంటిదే ఈ కార్డియాక్ అరెస్ట్. ప్రస్తుతం యువత నుంచి పెద్దల వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆరోగ్యవంతమైన వ్యక్తులు సైతం కార్డియాక్ అరెస్ట్ బారిన పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకు కారణాలివే..

సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కు గుండె జబ్బులు ప్రధాన కారణం. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అవరోధాల వల్ల, గుండె కండరం జబ్బు పడడం వల్ల.. ఇలా గుండె, సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురి అవడానికి ఎన్నో కారణాలుంటాయి. గుండెపోటుకు గురైన ప్రతి సందర్భంలో గుండె ఆగిపోయే పరిస్థితి తలెత్తకపోవచ్చు. ఛాతీ నొప్పి, ఆయాసం లాంటి లక్షణాలతో గుండెపోటుకు గురైతే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకునే సమయం ఉంటుంది.

కానీ తీవ్రమైన గుండెపోటుకు గురైన సందర్భాల్లో సడెన్ కార్డియాక్ అరెస్ట్ అనే ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ పరిస్థితి అకస్మాత్తుగా తలెత్తుతుంటుంది. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తున్న సందర్భంలో లేదా పార్కులో నడుస్తున్న సమయంలో..

ఇలా ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ పరిస్థితి రావచ్చు. ఇలాంటప్పుడు కొన్ని నిమిషాల్లోపే గుండెను కొట్టుకునేలా చేయకపోతే, రక్తస్రావం జరగక మెదడు దెబ్బతింటుంది. కాబట్టి తక్షణమే స్పందించి వెంటనే సీపీఆర్ చేసి గుండె కొట్టుకునేలా చేయాలి.

కొన్ని కారణాలు..

  1. శారీరక శ్రమ లేకపోవడం కార్డియాక్ అరెస్ట్‌కు దారితీస్తోంది. అంతేకాదు.. తీవ్రమైన వ్యాయామం కూడా కారణమవుతోంది. ముఖ్యంగా క్రీడాకారులు, జిమ్ ట్రైనర్లు గంటలకొద్దీ శ్రమించడం వల్ల గుండె సమస్యలు ఎక్కువై ప్రమాదకరమైన అరిథ్మియాకు దారితీస్తుంది. ఈ కారణంగా అకస్మాత్తుగా గుండెనొప్పి బాధపడుతున్నారు. 
  2. గుండె సమస్యకు జన్యుపరమైన కారణాలున్నాయి. కుటుంబ సభ్యులలో ఎవరైనా ఈ సమస్యతో చనిపోతే ఇతరులకు వచ్చే ప్రమాదం ఉంది. 
  3. మయోకార్డిటిస్, తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల గుండె కండరాలకు వాపు వస్తుంది. ఈ సమస్య గుండె ఆగిపోవడానికి దారితీయొచ్చు. 
  4. అసమతుల్య ఆహారం, అధిక బరువు బరువు కూడా ప్రమాదం.
  5. దీర్ఘకాలిక ఒత్తిడి కూడా గుండెకు ఇబ్బంది కలిగిస్తుంది.